Site icon NTV Telugu

Russia China Iran Support: ఈయూకు షాక్ ఇచ్చిన రష్యా-చైనా.. ఇరాన్‌కు అండగా రెండు దేశాలు..

Russia China

Russia China

Russia China Iran Support: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న చైనా – రష్యాలు సోమవారం టెహ్రాన్‌పై యూరోపియన్ దేశాలు (EU) ప్రతిపాదించిన UN ఆంక్షలను తిరస్కరించాయి. దీంతో ఇరాన్‌కు ఈ రెండు దేశాల నుంచి భారీ మద్దతు లభించినట్లు అయ్యింది. ఈ రెండు దేశాల నిర్ణయంతో యూరోపియన్ ఆంక్షలకు వ్యతిరేకత నుంచి ఇరాన్‌కు పెద్ద రిలీఫ్ లభించింది. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్లతో సహా E3 అని పిలువబడే దేశాలు ఇటీవల ‘స్నాడ్‌బ్యాక్ మెకానిజం’ కింద ఇరాన్ 2015 అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఆంక్షలను తిరిగి విధించడానికి నిర్ణయం తీసుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా, చైనా, రష్యా, ఇరాన్ మంత్రులు ఇది చట్టపరమైన సూత్రానికి విరుద్ధమని పేర్కొంటూ సంయుక్త లేఖను విడుదల చేశారు.

READ ALSO: OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్‌ దూరం..?

ఇరాన్ ఏం చెప్పిందంటే..
ఇరాన్ 2015 అణు ఒప్పందాన్ని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని పిలుస్తారు. ఈ ఒప్పందంలో ఆరు దేశాలు చేరాయి. ఇరాన్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ. ఈ ఒప్పందం ప్రకారం.. ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడానికి బదులుగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఆ తర్వాత ఇరాన్ ఒప్పందంలో నిర్దేశించిన యురేనియం ఉత్పత్తి పరిమితిని ఉల్లంఘించినట్లు వార్తలు బయటికి వచ్చాయి. అమెరికా ఒప్పందం నుంచి వైదొలిగే హక్కు తమకు ఉందని ఇరాన్ తెలిపింది. ఈ ఒప్పందం 2025 అక్టోబర్లో ముగియనుంది. 2015లో ఎత్తివేసిన ‘స్నాడ్‌బ్యాక్ మెకానిజం’ మళ్లీ అమలు చేయబడటానికి ముందు టెహ్రాన్‌పై పాత ఆంక్షలు విధించడానికి ఈయూ సిద్ధమైంది.

జూన్‌లో ఇజ్రాయెల్, అమెరికా కలిసి టెహ్రాన్ అణు కర్మాగారాలపై అనేక దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత E3- ఇరాన్ మధ్య కొత్త ఒప్పందం గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ చర్చల ద్వారా ఇరాన్‌కు ఎటువంటి సానుకూల సంకేతాలు అందలేదు.

READ ALSO: Post Office FD Scheme: పోస్ట్ ఆఫీస్‌లో సూపర్ స్కీమ్.. రూ.10 లక్షలు లాభం.. ఎంత పెట్టుబడి పెట్టాలంటే..

Exit mobile version