Site icon NTV Telugu

Ukraine Attack: ఆస్పత్రిపై ఉక్రెయిన్‌ రాకెట్ దాడి.. 14 మంది మృతి

Ukraine Attack

Ukraine Attack

Ukraine Attack: రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్‌లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్‌ జరిపిన రాకెట్‌ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని ఆసుపత్రిపై ఉక్రేనియన్ మిలటరీ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని రష్యా ఆరోపించింది. అమెరికా సరఫరా చేసిన హిమార్స్ రాకెట్ లాంచ్ సిస్టమ్‌ను ఉపయోగించి నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారీస్థాయి పేలుడు పదార్థాలున్న రాకెట్లను ఉపయోగించడంతో రోగులు, వైద్య సిబ్బందిలో మరో 24 మంది గాయపడ్డారని తెలిపింది.

వైద్యలపై దాడి చేయడాన్ని యుద్ధ నేరం అనడంలో సందేహం లేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, దాని పాశ్చాత్య మిత్రదేశాలు రష్యన్ దళాలు తరచూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించాయి. దీనిలో వేలాది మంది పౌరులు మరణించారు. ఫిరంగి, వైమానిక దాడులతో నగరాలు, పట్టణాలు దెబ్బతిన్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా ఖండించింది.

Space Debris: ఆకాశంలో ‘చెత్త’.. ప్రపంచదేశాలకు సవాల్

ఇదిలా ఉండగా.. రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్‌ మెద్వెదేవ్‌ మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారు. మూడో ప్రపంచ యుద్ధమనేది వస్తే అది యుద్ధట్యాంకులతోనో, విమానాలతోనో మొదలు కాదనీ, చివరకు మిగిలేది బూడిదే అని ఆయన హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలు తమ చర్యను సమర్థించుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

Exit mobile version