Success Story: నీరజ్ చోప్రాను మట్టి కరిపించిన రుమేష్ పతిరాగే ఎవరు..? అతడికి క్రికెట్‌తో సంబంధం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామన్వెల్త్ గేమ్స్ 2026 జావెలిన్ త్రో పోటీల్లో శ్రీలంకకు చెందిన యువ అథ్లెట్ రుమేశ్ పతిరాగే సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ పోటీలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 85.83 మీటర్ల త్రోతో రజత పతకానికే పరిమితమవ్వగా, శ్రీలంకకు చెందిన పతిరాగే ఏకంగా 89.75 మీటర్ల సుదూర ప్రాంతానికి ఈటెను విసిరి పసిడి పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రాతో పాటు ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీమ్, కెషోర్న్ వాల్కాట్, ఆండర్సన్ పీటర్స్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలను వెనక్కి నెట్టి రుమేశ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే పోటీలో భారత్‌కే చెందిన మరో అథ్లెట్ యష్వీర్ సింగ్ 85.41 మీటర్ల వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
మార్చి 21, 2003న జన్మించిన రుమేశ్ పతిరాగే ప్రయాణం చాలా ఆసక్తికరమైనది. చిన్నతనంలో క్రికెటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, సెంట్ పీటర్స్ కాలేజీ తరఫున మీడియం పేసర్‌గా రాణించాడు. కౌమారదశలోనే ఆయన బౌలింగ్ వేగం గంటకు 134 కిలోమీటర్లుగా నమోదవ్వడం విశేషం. డిస్కస్, షాట్‌పుట్ త్రోయర్ అయిన తన తండ్రి సలహాతో మొదట డిస్కస్ త్రో ప్రాక్టీస్ చేసిన రుమేశ్, 2017లో తన కోచ్ టోనీ ప్రసన్న మార్గదర్శకత్వంలో జావెలిన త్రో వైపు అడుగులు వేశాడు. ఆటలోని ప్రాథమిక సూత్రాలు, జీవిత పాఠాలు నేర్పిన తన కోచ్ టోనీయే తన ఈ విజయానికి ముఖ్య కారణమని రుమేశ్ కృతజ్ఞతగా వెల్లడించాడు.
Also Read
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
కెరీర్ ప్రారంభం నుండి నిలకడైన ప్రదర్శన కనబరచడం రుమేశ్ ప్రత్యేకత. శ్రీలంక గత అథ్లెట్లు కేవలం ఒకట్రెండు సార్లు మాత్రమే మెరిసి ఆ తర్వాత ఫామ్ కోల్పోగా, రుమేశ్ మాత్రం వరుసగా 82 మీటర్లకు పైగా త్రో విసురుతూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నాడు. 2025 సీజన్లోనే ఆయన ఏకంగా 13 సార్లు 82 మీటర్ల మార్కును దాటడం ఆయన నిలకడకు నిదర్శనం. క్రికెట్ మైదానంలో పేస్ బౌలర్‌గా సత్తా చాటిన ఈ యువ అథ్లెట్, ఇప్పుడు జావెలిన్ త్రోలో ప్రపంచ దిగ్గజాలనే ఓడించి శ్రీలంక క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?