NTV Telugu Site icon

NTR : ఎన్టీఆర్ కోసం ‘సప్త సాగరాలు దాటి’ హీరోయిన్ ను తెచ్చిన ప్రశాంత్ నీల్

New Project (38)

New Project (38)

NTR : జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్నంత క్రేజీ ఏ హీరోకి లేదనే చెప్పాలి. అయితే దాదాపు ఆరేళ్ల త‌ర్వాత…జూనియ‌ర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా సోలో హీరోగా థియేటర్లలోకి అడుగుపెట్టాడు. అది కూడా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర సినిమాతో… జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో నెగిటివ్ టాక్ వచ్చినా.. ఇప్పుడు మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు ఈ దేవర. అయితే దేవర సినిమా సక్సెస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తున్న నేపధ్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వరలో షూటింగ్ ప్రారంభించి 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నారు.

Read Also:Train Accident: నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు..

భారీ యాక్షన్ జానర్లో ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ ల సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్ చల్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్ అని సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ప్రశాంత్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ని తీసుకురాబోతున్నాడు. దీనిపై నటి రుక్మిణి వసంతతో చర్చలు జరిపారట. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ ఇప్పటికే సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో ఆమె అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఇప్పుడు అందాల భామను ఎంపిక చేసినట్లు సమాచారం.

Read Also:Edupayala Temple: 8 రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం

Show comments