Aura Kid: ఓ రెండేళ్ల కుర్రాడు సోషల్ మీడియాను షేక్ చేశాడు. సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ స్టార్ అవ్వడం కొత్తేమీ కాదు. కానీ, ఏకంగా 138 మిలియన్ వ్యూస్ సాధించి, తన గ్రాడ్యుయేషన్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ పొందే అరుదైన అదృష్టాన్ని దక్కించుకున్నాడు రెండేళ్ల చిన్నారి. మహారాష్ట్ర (Maharashtra)లోని యవత్మాల్ జిల్లా (Yavatmal District)కు చెందిన రుద్రాంశ్ సింగ్ ఠాకూర్ (Rudransh Singh Thakur) అనే బుడతడు, సోషల్ మీడియాలో ‘ఆరా కిడ్’ (Aura Kid)గా పాపులర్ అయ్యాడు. ఓ లోకల్ హోండా షోరూమ్ ఓనర్ మనసు సైతం గెలుచుకున్నాడు. ఆ షోరూమ్ లో తీసిన ఒక సింపుల్ వీడియో వైరల్ అవ్వడంతో, ఆ డీలర్ (Auto Dealer) ఈ చిన్నారికి కిండర్ గార్టెన్ నుంచి డిగ్రీ పూర్తయ్యే వరకు చదువు ఖర్చులన్నీ తనే భరిస్తానని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వైరల్ స్టోరీ (Viral Story) నవంబర్ 9న మొదలైంది. రుద్రాంశ్ తన తల్లిదండ్రులు, అక్కతో కలిసి యవత్మాల్‌లోని ‘సాయి పాయింట్ హోండా’ (Sai Point Honda) షోరూమ్‌కు కొత్త హోండా యాక్టివా (Honda Activa) స్కూటర్ డెలివరీ తీసుకోవడానికి వెళ్ళాడు. ఫ్యామిలీ అంతా కొత్త బండి కొన్న సంతోషంలో ఉంటే, రెండేళ్ల రుద్రాంశ్ మాత్రం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. కళ్ళకు సన్‌గ్లాసెస్ (Sunglasses) పెట్టుకుని, జీన్స్ ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని, ఏమాత్రం బెరుకు లేకుండా కెమెరా ముందు ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఇచ్చిన పోజులు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి.
ఆ క్యూట్ మూమెంట్‌ను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో పోస్ట్ చేయడంతో, అది కాస్తా విపరీతంగా వైరల్ (Viral Reel) అయింది. చిన్నారి ఎక్స్‌ప్రెషన్స్, ఆ స్వాగ్ (Swag) చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. నవంబర్ 19 నాటికి ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు ఏకంగా 139 మిలియన్లకు పైగా వ్యూస్, 11.5 మిలియన్ లైక్స్ (Likes), 68 వేలకు పైగా కామెంట్స్ (Comments), 2.5 మిలియన్ షేర్స్ (Shares) వచ్చాయి. ఇంతటి క్రేజ్ రావడంతో నెటిజన్లు ఈ చిన్నారికి ‘ఆరా కిడ్’ అని ముద్దుగా పేరు పెట్టేశారు. ఈ వీడియో కాస్తా వాళ్ళు స్కూటర్ కొన్న ‘సాయి పాయింట్ హోండా’ షోరూమ్ ఓనర్ దిలీప్ బోబడే పాటిల్ (Dilip Bobade Patil) కంట పడింది. తన షోరూమ్‌లో తీసిన వీడియో ఇంత పెద్ద హిట్ అవ్వడంతో ఆయన ఎంతో సంతోషించారు. వెంటనే రుద్రాంశ్ ఫ్యామిలీని షోరూమ్‌కు ఆహ్వానించి, చిన్నారి పాపులారిటీని సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగానే రుద్రాంశ్ చదువుకు సంబంధించి కిండర్ గార్టెన్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయ్యే పూర్తి ఖర్చులను తనే భరిస్తానని పాటిల్ గొప్ప మనసుతో ప్రకటించారు.
వైరల్ అయిన తర్వాత రుద్రాంశ్‌కు చాలా గిఫ్ట్‌లు వచ్చినప్పటికీ, షోరూమ్ ఓనర్ చేసిన ఈ ఎడ్యుకేషనల్ స్పాన్సర్‌షిప్ (Educational Sponsorship) వాటన్నింటికంటే ఎంతో విలువైనదని కంటెంట్ క్రియేటర్ యశ్ చించోల్కర్ (Yash Chincholkar) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు, తన కొడుకు వీడియోకు వస్తున్న ఈ అద్భుతమైన స్పందన పట్ల రుద్రాంశ్ తల్లి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకుముందు తాను ఆన్‌లైన్‌లో వేరే పిల్లల వీడియోలు చూసి మురిసిపోయేదాన్నని, ఇప్పుడు తన కొడుకుపై జనం ఇంత ప్రేమ కురిపించడం, దానికి తోడు చదువుకు ఇలాంటి సాయం అందడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మిగిల్చిందని ఆమె సంతోషంగా చెప్పారు.

