Site icon NTV Telugu

Paralympics 2024: పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం..

Rubina

Rubina

పారాలింపిక్స్లో భారత్కు మరో పతకం వచ్చింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో రుబీనా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్‌లో భారత్‌కు చెందిన రుబీనా ఫ్రాన్సిస్ 211.1 స్కోరుతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పిస్టల్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారత పారా షూటర్ అథ్లెట్‌గా రుబీనా రికార్డు సృష్టించింది. పారిస్ పారాలింపిక్ క్రీడల్లో భారత్‌కు ఐదో పతకాన్ని అందించింది. రుబీనా క్వాలిఫికేషన్‌లో ఏడో స్థానంలో నిలువగా.. ఫైనల్‌లో బలమైన ప్రదర్శన చేసింది.

Read Also: Crime News: క్రైమ్ సినిమా చూసి భార్య హత్య.. శరీరాన్ని ముక్కలుగా కోసి పలుచోట్ల పడేసిన భర్త

ఈ పారాలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు ఇది నాలుగో పతకం. రుబీనా కంటే ముందు శుక్రవారం ఒక్కరోజు భారత్ నాలుగు పతకాలు సాధించింది. అవనీ లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 ఈవెంట్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని సాధించగా.. మోనా కాంస్యం గెలుచుకుంది. మరోవైపు.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో మనీష్ నర్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

Read Also: Nuziveedu: నూజివీడులో పెద్ద చెరువుకు గండి.. జలదిగ్బంధంలో 50 ఇళ్లు

Exit mobile version