NTV Telugu Site icon

University Scam: ఆ యూనివర్సిటీలో 44 లక్షల కుంభకోణం.. టీ, బిస్కెట్ల కోసం రూ.8 లక్షలు ఖర్చు..

Vinoba Bhave University

Vinoba Bhave University

జార్ఖండ్‌లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో లక్షల రూపాయల కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ దర్యాప్తు తర్వాత, వినోబా భావే విశ్వవిద్యాలయంలో జరిగిన రూ.44 లక్షల కుంభకోణం నిజమని తేలింది. ఈ కుంభకోణం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముకుల్ నారాయణ్ దేవ్ హయాంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆడిట్ డైరెక్టరేట్ ఆడిట్ నివేదికను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌కు సమర్పించింది. ఒక నెలలోపు ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, దోషులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, ఆర్థిక శాఖకు తెలియజేయాలని విశ్వవిద్యాలయాన్ని కోరింది.

READ MORE: Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు.. కీలక ఆటగాడు ఎంట్రీ

వీసీ కార్యాలయంలో స్నాక్స్ మొదలైన వాటి కోసం దాదాపు రూ.8 లక్షలు ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. టీ, బిస్కెట్ల కోసం అది కూడా కరోనా కారణంగా విశ్వవిద్యాలయం మూసినప్పుడు ఈ దుబారా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. అంతే కాకుండా.. వైస్ ఛాన్సలర్ నివాసానికి రంగులు వేయడానికి లక్షల రూపాయలు అనవసరంగా ఖర్చు చేశారు. పెయింట్ సంబంధిత మెటీరియల్ కొనుగోలులో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అదేవిధంగా ప్రభుత్వ వాహనాన్ని వ్యక్తిగత పనుల కోసం వినియోగించారు. ఇంధనం భారం మొత్తం యూనివర్సిటీ ఫండ్‌లో తీసుకున్నారు.

READ MORE: Bird Flu Outbreak: బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. గుంటూరులో చికెన్ అమ్మకాలు మాత్రం..

మాజీ వీసీ ముకుల్ నారాయణ్ దేవ్ కోసం అనవసరంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశారు. 4 నెలల వ్యవధిలో విశ్వవిద్యాలయ నిధులను ఉపయోగించి రెండుసార్లు మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసినట్లు కూడా కనుగొన్నారు. కంప్యూటర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. మళ్లీ వాటి కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. కొనుగోలు చేసిన వస్తువుల గురించిన సమాచారం స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయలేదు. అదేవిధంగా.. వైస్ ఛాన్సలర్ నివాసంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో భారీ అక్రమ ఖర్చు జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. వైస్ ఛాన్సలర్ నివాసంలో మంచం, సోఫా, వాషింగ్ మెషిన్ వంటి వస్తువుల కొనుగోలు, ఖరీదైన వైద్య పరికరాల కొన్నారు.