NTV Telugu Site icon

SS Rajamouli : ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి ఒరిజినల్ వెర్షన్ కాదా.. అన్ని మార్పులు చేసారా..?

Whatsapp Image 2024 03 19 At 12.37.08 Pm

Whatsapp Image 2024 03 19 At 12.37.08 Pm

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్ ‘ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీని ఎంతగానో మెచ్చుకున్నారు..కాగా ఈ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ నెల (మార్చి) 24కు రెండు సంవత్సరాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తీసుకు వచ్చిన చిత్రమిది.భారతీయ ప్రేక్షకులతో పాటు విదేశీ ప్రేక్షకులకు, సినీ ప్రముఖులకు ‘ఆర్ఆర్ఆర్’ ఎంతగానో నచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకీ సంబంధించి దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాలు తెలియజేసారు.ప్రేక్షకులంతా చూసిన ‘ఆర్ఆర్ఆర్’ వేరు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఒరిజినల్ వెర్షన్ వేరు. సినిమా అంతా పూర్తి అయ్యాక మరీ శాడ్ ఫిలింలా ఉందని ఫీలై, యంగ్ టైగర్ ఎన్టీఆర్,ఆయనకు జోడీగా నటించిన ఫారిన్ యాక్ట్రెస్ ఒలీవియా మోరిస్ క్యారెక్టర్లలో మార్పులు చేశారట.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లేదా డిలీట్ చేసిన సీన్స్ లో జెన్నీ అలియాస్ జెన్నీఫర్ (ఒలీవియా) క్యారెక్టర్ మరణిస్తుందని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చెప్పారు.

ప్రస్తుతం రాజమౌళి  జపాన్ లో ఉన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్పెషల్ షోకి అటెండ్ అయ్యారు. షో అనంతరం ప్రేక్షకులతో ముచ్చటిస్తూ… ”మేం తొలుత జెన్నీ తన అంకుల్ గదిలోకి వెళ్లి వాళ్ల ప్లాన్స్ తెలుసుకునే సన్నివేశాలు రాశాం. అయితే, క్లైమాక్స్ దగ్గర పడుతుండటంతో అవన్నీ అవసరం లేదని ఫీల్ అయ్యాం. డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదనుకున్నాం. భీంను కలిసిన జెన్నీ, మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు ఆమె బూట్లకు మట్టి ఉండటంతో ఏదో చేసిందని ఆంటీకి అనుమానం వస్తుంది. అలాగే, జైలు నుంచి రామ్ ను భీం తప్పించి… బ్రిటిషర్ల మీద ఎటాక్ చేసినప్పుడు జెన్నీకి అంకుల్ గన్ గురి పెడతారు. వాళ్ళను లొంగిపోమని చెబుతాడు.లొంగిపోవడానికి ముందు షూట్ చేయడంతో జెన్నీ మరణిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీ చచ్చిపోతుంది. నేను అంత సాడ్ ఫిల్మ్ తీయాలని అనుకోలేదు” అని రాజమౌళి చెప్పారు.’ఆర్ఆర్ఆర్’ ఒరిజినల్ వెర్షన్ లో జెన్నీఫర్ క్యారెక్టర్ మార్చడంతో ఎన్టీఆర్ క్యారెక్టర్ సన్నివేశాలు కూడా మారాయట. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయితే ఎలా ఉండేదో అని అభిమానులు చర్చించుకుంటున్నారు.