RRR Record Collections: దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ట్రిపుల్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో రికార్డులతో సంచలనం సృష్టించిన మూవీ రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 21, 2022 న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ నిమిత్తం దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు జపాన్‌కి వెళ్లారు. ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ అక్కడి ఫ్యాన్స్‌తో సందడి చేశారు. జపాన్‌లో కూడా ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. రెండు వారాలకు గాను జపాన్ కరెన్సీలో 135 మిలియన్ యెన్స్‌ను సొంతం చేసుకున్నట్టు అక్కడ బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
Read Also: KGF 3 : కేజీఎఫ్ 3 పై యశ్.. అందుకు సిద్ధమే కానీ ఇప్పుడు కాదు
ట్రిపుల్ఆర్ కలెక్షన్లు అమెరికన్ డాలర్లలో మిలియన్ డాలర్‌కు దగ్గరగా ఉంది. మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వరకు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ వేదికగా చూశారు. ఇక జపాన్ ప్రేక్షకులు చాలా మంది ఇది వరకు ఓటీటీలో సబ్ టైటిల్స్‌లో చూశారు. అలాంటి సినిమాకు అక్కడ ఈ రేంజ్ వసూళ్లు రావడం మాములు విషయం కాదనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే ఈ చిత్రం తాజాగా సాటర్న్ బెస్ట్ ఇంటర్నేషనల్ అవార్డ్‌ను గెలుచుకుంది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సాటర్న్ అవార్డ్స్ లో ట్రిపుల్ఆర్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, అవార్డ్స్ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎస్‌ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు రెండో సాటర్న్ అవార్డు అంటూ తెలిపారు. మొదటి అవార్డు బాహుబలికు వచ్చింది.