NTV Telugu Site icon

Maharashtra: పార్కింగ్ విషయంలో గొడవ..పోలీసు చెంప దెబ్బ కొట్టడంతో మృతి

Wife Kills

Wife Kills

ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల కారణంతోనే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నారు. తమ పంతం నెగ్గించుకోవడం కోసమో, ఇగోల కారణంతోనే ఎదుటివారిపై దాడి చేస్తున్నారు. ప్రాణాలంటే విలువలేకుండా క్షణాల్లో హత్య  చేసేస్తున్నారు. తరువాతి పరిణామాలు, జీవితం గురించి ఆలోచించకుండా విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘర్షణలో విచక్షణ కోల్పోయి ఓ వ్యక్తిని కొట్టింది ఓ పోలీసు అధికారి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగింది ఈ షాకింగ్ ఘటన.

Also Read: Viral Video : మెట్రోలో రెచ్చిపోయిన లవర్స్..అందరు చూస్తుండగానే ఆ పని.. వీడియో…

వివరాల ప్రకారం ఎస్‌ఆర్‌పీఎఫ్‌కు చెందిన నిఖిల్ గుప్తా వథోడా పోలిస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన చెల్లిల్ని చూడటానికి వచ్చాడు. ఆయన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ పని చేస్తున్నాడు. ఇంటి ముందు కారు పార్క్‌ చేస్తుండగా హెడ్‌లైట్ హైబీమ్‌లో ఉండటంతో అక్కడే ఉంటున్న స్థానికుడు 54 ఏళ్ల వ్యక్తి  మురణీధర్ రామరావ్‌జీ నవారే ఇబ్బంది పడ్డాడు. దీంతో కారు లైట్ లో బీమ్ లో పెట్టి పార్క్ చేయాలని సూచించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన నిఖిల్, నవారే చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆయన రెండు రోజుల్లో చనిపోయాడు. నిఖిల్ కొట్టడం వల్లే ఆయన చనిపోయినట్లు వైద్యలు నిర్ధారించారు. దీంతో పోలీసులు నిఖిల్‌పై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. చిన్న గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీయడం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆవేశంతో చేసే పనుల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో అనడానికి ఈ ఘటనే నిదర్శనం అని చెప్పవచ్చు.