NTV Telugu Site icon

Royal Enfield New Record: వాడు నడిపే బండీ.. రాయల్‌ ఎన్‌ఫీల్డు. సేల్స్‌లో కొత్త రికార్డు

Royal Enfield New Record

Royal Enfield New Record

Royal Enfield New Record: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ టూ-వీలర్‌ రికార్డ్‌ నెలకొల్పింది. ఆ వెహికిల్‌ చరిత్రలో ఒక ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఎన్నడూ లేనన్ని యూనిట్లు సేల్‌
అయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ తయారీ సంస్థ ఐషర్‌ మోటార్స్‌.. 650 సీసీ మోటార్‌ సైకిల్స్‌ రేంజ్‌ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా స్క్రామ్‌ 650 సీసీ, క్లాసిక్‌ 650 మరియు హిమాలయన్‌ 650 మోడళ్లను ఈ ఏడాది మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని ఆశిస్తోంది.

350 సీసీ కేటగిరీలో కూడా రెండు కొత్త బైక్‌లను లాంఛ్‌ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా బుల్లెట్‌ 350 మరియు ఎలెక్ట్రా 350 మోడళ్లను రూపొందిస్తోంది. ఇదిలా ఉండగా.. పండగ సీజన్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. కొత్త వాహనాలు.. బీఎస్‌6 ఫేజ్‌2లోకి ప్రవేశించనుండటం కూడా కలిసొచ్చింది. మార్కెట్‌ లీడర్‌ హీరో మోటాకార్ప్‌ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది.

read more: Crude Oil Conspiracy: ‘క్రూడాయిల్‌’ వెనక కుట్ర!. ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గిస్తున్నాయా?

హీరో మోటోకార్ప్‌ పోటీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ అమ్మకాలు సైతం కొంచెం పెరిగాయి. మొత్తమ్మీద చూస్తే.. మార్చి నెలలో.. ప్రయాణికుల వాహనాల సేల్స్‌ విశ్లేషకుల అంచనాలకు తగ్గట్లే స్థిరంగా నమోదయ్యాయి. కమర్షియల్‌ వెహికిల్స్‌ విక్రయాలు మాత్రం విశేషంగా జరిగాయి. దీంతో.. ప్రతి ఐదు పెద్ద కంపెనీల్లో కనీసం మూడు కంపెనీలు గ్రోత్‌ సాధించాయి.

ప్యాసింజర్‌ వెహికిల్‌ సెగ్మెంట్‌లో మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. మిగతా సంస్థల వాహన విక్రయాలు ఓ మోస్తరుగా జరిగాయి. బీఎస్‌6 ఫేజ్‌2 ఎమిషన్స్‌ నిబంధనలు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుండటంతో వాహనాల రేట్లు పెరుగుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వినియోగదారులు ముందుగానే.. అంటే.. మార్చిలోనే వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయటం గమనార్హం.

మరోవైపు.. మీడియం అండ్‌ హెవీ కమర్షియల్‌ వెహికిల్‌ డిస్పాచ్‌లు కూడా అంచనాలను మించి జరిగాయి. కమర్షియల్‌ వెహికిల్‌ సెగ్మెంట్‌లో సేల్స్‌ ఇక ముందు కూడా ఇలాగే ఆశాజనకంగా ఉంటాయని జేఎం ఫైనాన్షియల్‌ అనలిస్టులు అంచనా వేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల నుంచి బస్సుల కొనుగోలు ఆర్డర్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

ప్రయాణికుల వాహనాల విషయానికొస్తే.. XUV 700, స్కార్పియో-ఎన్‌ మరియు థార్‌ తదితర కార్ల విభాగంలో మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీ.. చెప్పుకోదగ్గ స్థాయిలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ బిజినెస్‌ ఆల్‌ టైమ్‌ హై లెవల్‌లో జరిగిందని ఆ సంస్థ ఆటోమోటివ్‌ డివిజన్‌ తెలిపింది.