ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని వ్యాఖ్యలు చేసింది. సీబీఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరికించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్షులు లేదా స్టేట్‌మెంట్ల మద్దతు లేదని స్పష్టం చేసింది. సిసోడియాపై ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లను కోర్టు డిశ్చార్జ్ చేసింది. కేజ్రీవాల్‌ను సరైన ఆధారాలు లేకుండా ఇరికించారని జడ్జి వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితకు క్లీన్ చీట్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నిటిని కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్. కవితతో పాటు ఈ కేసులో ఉన్న 23 మంది నిందితులు తప్పు చేశారన్న సాక్ష్యా దారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
