Site icon NTV Telugu

Roti Kapada Romance : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్

Roti Kapada Romance

Roti Kapada Romance

Roti Kapada Romance : హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ విక్రమ్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలై అన్ని సెంటర్లలో డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది.

Read Also:Nayantara : నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు.. అసలేం జరిగిందంటే !

అయితే ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా ఓటీటీలో వచ్చేసింది. యువత ప్రేమ అలాగే ఫ్రెండ్షిప్ నేపథ్యంలో దర్శకుడు తెరకెక్కించిన ఈ కామెడీ ఎమోషనల్ డ్రామా ఇప్పుడు చూడాలి అనుకుంటే ఈటీవీ విన్ లో ప్రసారం అవుతుంది. యువతకి నచ్చే అంశాలు ఆలోచింపజేసే సీన్లతో మేకర్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రానికి సన్నీ ఎం ఆర్, ఆర్ ఆర్ ధృవన్ లు సంగీతం అందించారు.

Read Also:One Nation One Election: ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా, నేటి యూత్‌ను ఆకట్టుకునే అంశాలుతో రూపొందించారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని చూడలేదని చూసిన వాళ్లు చెబుతున్నారు. ఈ చిత్రం 2024లో విడుదలైన చిత్రాల్లో ఉత్తమ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా యూత్ ను ఆకట్టుకుందని చెప్పొచ్చు.

Exit mobile version