Site icon NTV Telugu

Ross Taylor: రిటైర్మెంట్‌పై రాస్ టేలర్ యూటర్న్.. కాకపోతే, ఈసారి ఆ దేశం తరుపున!

Ross Taylor

Ross Taylor

Ross Taylor: న్యూజిలాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రాస్ టేలర్ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టబోతున్నారు. కానీ, ఈ సారి ఆయన బ్లాక్ క్యాప్స్‌ కోసం కాదు.. తన సొంత దేశమైన సమోవా జట్టు కోసం ఆడనున్నారు. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ 41 ఏళ్ల దిగ్గజం, సమోవాకు వచ్చే ఏడాది జరిగే T20 వరల్డ్ కప్ అర్హత సాధించడంలో సహాయం చేయబోతున్నాడు. టేలర్ న్యూజిలాండ్ తరఫున 112 టెస్టులు, 236 వన్డేలు, 102 టి20లు ఆడి రికార్డు సృష్టించాడు.

Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

ఇది ఇలా ఉండగా.. తాను న్యూజిలాండ్ తరఫున ఆడుతున్న కూడా ఎప్పుడూ సమోవా క్రికెట్‌కు ఏదో ఒక రూపంలో సహాయం చేయాలనే కోరిక ఉందని సీతెలిపారు. మొదట కోచ్‌గా లేదా పిల్లలకు మార్గదర్శనం చేయడం అనుకున్నా కానీ, తిరిగి ఆటగాడిగా జట్టులో భాగమవుతానని ఊహించలేదని ఆయన స్పష్టం చేశాడు. సమోవా జట్టుకు కోచ్‌గా ఉన్న టారుణ్ నేతులా (2012లో బ్లాక్ క్యాప్స్ తరఫున ఆడిన మాజీ ఆటగాడు) టేలర్‌ను జట్టులో చేర్చడం పట్ల ఎంతో కృషి చేశారు. అలాగే ఆక్‌లాండ్ ఏసెస్ ఆల్‌రౌండర్ షాన్ సోలియా కూడా జట్టులో ఉన్నాడు. ప్రపంచ కప్‌కి తొలిసారి అర్హత సాధించాలనే సమోవా కలను నిజం చేయడంలో టేలర్ అనుభవం కీలకం కానుంది.

Ghati : అనుష్క ‘ఘాటీ’ మూవీ పబ్లిక్ టాక్ – హిట్ కొట్టిందా?

సమోవా అక్టోబర్‌లో ఒమాన్‌లో జరిగే ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్స్ లో పోటీపడనుంది. ఒమాన్, పాపువా న్యూ గినియాతో ఒకే గ్రూప్‌లో ఉండటం సవాల్‌గానే ఉన్నా, రెండో రౌండ్‌కు చేరి భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌కి అర్హత సాధించడమే ప్రధాన లక్ష్యమని టేలర్ స్పష్టం చేశాడు. సమోవా రగ్బీ, రగ్బీ లీగ్‌లలో ప్రపంచస్థాయిలో తన ముద్ర వేసింది. అదే విధంగా క్రికెట్‌ కూడా పసిఫిక్ దీవుల్లో విస్తరించడానికి ఇది మంచి ఆరంభం కానుంది. యువతకు కొత్త మార్గాన్ని చూపుతుందని టేలర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Exit mobile version