టాలీవుడ్ నటి, మాజీ ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్ల కారణంగా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా రోజా కూతురు అన్షు మాలిక త్వరలోనే ఒక స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లనుందని, అలాగే సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై రోజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Jai Hanuman:‘జై హనుమాన్’ నుంచి తేజ సజ్జ ఔట్? రూమర్ వెనుక అసలు నిజం ఇదే
తమ కుటుంబం గురించి వస్తున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రోజా స్పష్టం చేశారు. ఒక స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందన్న ప్రచారంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘అసలు ఆ స్టార్ హీరో ఎవరో చెబితే నేను తెలుసుకుంటాను’ అంటూ నవ్వుతూ కొట్టిపారేశారు. అన్షు మాలిక లక్ష్యం నటి కావడం కాదని, ఆమె ఒక సైంటిస్ట్ కావాలని కలలు కంటోందని.. అందుకే ప్రస్తుతం అమెరికాలో ఉంటూ ఉన్నత చదువులపై దృష్టి పెట్టిందని, ఇటీవల ఇటాలియన్ భాషను కూడా నేర్చుకుందని రోజా తెలిపారు. అలాగే పిల్లల పెంపకం విషయంలో తాను ఎప్పుడూ స్వేచ్ఛనిస్తానని, తన ఇష్టాలను వారిపై రుద్దనని రోజా భావోద్వేగంగా చెప్పారు.
అంతగా అన్షుకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తా కానీ ప్రస్తుతం ఆమె చదువుకే ప్రధమ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. చదువులోనే కాకుండా, పేద పిల్లలకు సహాయం చేయడంలో కూడా అన్షు ముందుంటుందని ఆమె గర్వంగా చెప్పుకొచ్చారు. ఈ వివరణతో అన్షు మాలిక పెళ్లి మరియు సినీ అరంగేట్రంపై వస్తున్న రూమర్లకు రోజా ఫుల్ స్టాప్ పెట్టారు.
