Site icon NTV Telugu

Rohit Sharma: సీక్రెట్‌గా కానిచ్చేస్తున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్!

Rohit Sharma

Rohit Sharma

వన్డే, టీ20 సిరీస్‌ల కోసం త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్ వెళ్లనుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్, అక్టోబర్ 29 నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్‌ శర్మ ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్‌ ఆడనున్న సిరీస్‌ ఇదే. దాదాపు 7 నెలల తర్వాత హిట్‌మ్యాన్ జట్టులోకి వచ్చాడు. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు బీసీసీఐ వన్డే పగ్గాలు అప్పగించడంతో.. రోహిత్‌ ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేని హిట్‌మ్యాన్.. మరింత దూకుడుగా ఆడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: ICC Rankings 2025: దుమ్మురేపిన మహ్మద్ సిరాజ్.. అత్యుత్తమ రేటింగ్‌ పాయింట్లు!

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం రోహిత్‌ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించాడు. నవీ ముంబైలో సీక్రెట్‌గా నెట్‌ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఘన్సోలిలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో సాధన చేస్తున్నాడట. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ చేశాక.. సాయంత్రం 2025 సియట్‌ క్రికెట్‌ రేటింగ్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడట. ప్రాక్టీస్ సెషన్‌లో 10 మంది నెట్ బౌలర్లు రోహిత్‌కు బౌలింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో పేస్ పిచ్‌లు ఉంటాయి కాబట్టి.. ఎక్కువగా బౌన్సర్లను ఎదుర్కొంటున్నాడు. హిట్‌మ్యాన్ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాపై చెలరేగాలని రోహిత్ ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version