NTV Telugu Site icon

Rohit Sharma: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ ఎమోషనల్ పోస్ట్..

Rohit

Rohit

Rohit Sharma Did Emotional Post On Shikar Dhawan Retirement: టీమిండియాకు అనేక మ్యాచ్ లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ గా వ్యవహరించిన బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ ఆగస్టు 24 ఉదయం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విష్యం తెలిసిందే. నిజానికి., అతని నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది ఇలా ఉండగా తాజాగా అనేక మ్యాచ్ లలో ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ఈ ఎడమ చేతి బ్యాట్స్‌మన్‌ కు భావోద్వేగ పోస్ట్ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో వారు ఇద్దరున్న అనేక చిత్రాలను పంచుకున్నాడు. రోహిత్ శర్మ.. ధావన్‌ ను క్రికెట్ మైదానంలో, బయట ప్రపంచంలో అతని ఆడంబరమైన వ్యక్తిత్వం కోసం ‘ది అల్టిమేట్ జాట్’ అని పేర్కొన్నాడు.

Buddy OTT: ఓటీటీలోకి ‘బడ్డీ’ సినిమా.. ఏ ఓటీటీ ప్లాట్‭ఫామ్‭లో చూడొచ్చంటే..

రోహిత్ తన పోస్ట్‌లో.. ఒక గదిని పంచుకోవడం నుండి మైదానంలో జీవితకాల జ్ఞాపకాలను పంచుకోవడం వరకు, మీరు ఎల్లప్పుడూ మరొక చివరలో నా పనిని సులభతరం చేసారు. ది అల్టిమేట్ జట్.. అంటూ రాసుకొచ్చాడు. ఇక ధావన్, రోహిత్ తొలిసారి 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్లుగా ఆడారు. ఆ తర్వాత ఇద్దరూ వెనుదిరిగి చూడలేదు. 2013 – 2022 మధ్య, వీరిద్దరూ వన్డే మ్యాచ్ లలో మొత్తం 115 సార్లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించి, అందులో 5,148 పరుగులు చేశారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య 18 సెంచరీలు, 15 అర్ధ సెంచరీల భాగస్వామ్యాలు నమోదయ్యాయి. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఓపెనింగ్ జోడీ వీరిద్దరిది. వీరిద్దరూ 195 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 14,000కు పైగా పరుగులు సాధించారు.

Show comments