NTV Telugu Site icon

Rohit Sharma Dance: బావమరిది పెళ్లిలో భార్యతో కలిసి రోహిత్ శర్మ డ్యాన్స్.. వీడియో వైరల్

Rohit Sharma Dance

Rohit Sharma Dance

Rohit Sharma Dance: వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డేలో భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీతో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌ పగ్గాలు చేపట్టాడు. మొదటి వన్డే నుంచి వైదొలగిన రోహిత్.. తన బావమరిది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. పెళ్లి వేడుకలో రోహిత్, తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వేదికపై భార్య రితికా సజ్దేతో కాలు కదుపుతున్నట్లు కనిపించాడు. బాలీవుడ్ పాట ‘లాల్ ఘాగ్రా’కు భారత కెప్టెన్ డ్యాన్స్ చేసిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గురువారం రాత్రి జరిగిన వేడుకలో రోహత్ శర్మ భార్య రితికాతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఇందులో రోహిత్ పాములా చేతులు కదుపుతూ భార్యతో కలిసి స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత భార్యపై డబ్బుల కురిపిస్తున్న చేతులు ఆడిస్తూ సరదాగా కనిపించాడు. ఈ వీడియోపై నెటిజన్లతో పాటు అభిమానులు కూడా తెగ ఇష్టపడుతున్నారు. రోహిత్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read Also: IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా

రెగ్యులర్ కెప్టెన్ లేకపోవడంతో హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ పాత్రను స్వీకరించిన హార్దిక్ పాండ్యా తనను తాను తెలివైన కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరీలో వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా అద్భుతంగా రాణించాడు. చివరి రెండు వన్డేలకు రోహిత్ తిరిగి వస్తాడని భావిస్తున్నారు. అంతకుముందు, అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో వెన్నులో గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండటంతో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో పేస్ డిపార్ట్‌మెంట్‌కు కూడా పరీక్ష జరగనుంది. అతను గాయంతో చాలా కాలం పాటు సైడ్‌లైన్‌లో ఉన్నాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యువ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా భారత్‌లో వన్డే ప్రపంచకప్‌లో తమ స్థానాలను పదిలపరచుకోవాలని చూస్తున్నారు.

 

Show comments