రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇది 1950-70ల కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే డ్రగ్ మాఫియా కథ అని సమాచారం. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన సినిమాకాన్ వేడుకలో యశ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
సాధారణంగా గ్యాంగ్‌స్టర్ కథలను పురుష దర్శకులే అద్భుతంగా తీయగలరనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. అయితే గీతూ మోహన్‌దాస్ ఆ నమ్మకాన్ని పటాపంచలు చేయబోతున్నారని యశ్ పేర్కొన్నారు.. ‘గీతూ ఒక గొప్ప రచయిత్రి. ఈ కథను ఆమె చూసిన కోణం చాలా కొత్తగా ఉంది. శృంగార సన్నివేశాల నుంచి రక్తపాతం చిందించే యాక్షన్ సీన్స్ వరకు.. ప్రతి దానిలోనూ ఒక రకమైన స్పష్టత, సున్నితత్వం కనిపిస్తాయి. ఒక మహిళా దర్శకురాలు అన్ని రకాల భావోద్వేగాలను ఇంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయగలరా అని ఆమెతో ప్రయాణించాకే నాకు అర్థమైంది’ అని యశ్ ప్రశంసించారు. అలాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యాక్షన్ సన్నివేశాలు చాలా విభిన్నంగా, రియలిస్టిక్ గా ఉండబోతున్నాయని యశ్ హింట్ ఇచ్చారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
