NTV Telugu Site icon

Robot Dance: అరెరె.. ఈ రోబోలు బలే డాన్స్ చేసేతున్నాయిగా.. వీడియో వైరల్..

Robo Dog

Robo Dog

ఇదివరకు మనం రోబో పేరు చెబితే కేవలం అవి కూర్చోవడం, నిలుచడం, లేదా ఏదైనా చెప్పిన పనిని మాత్రం చేసే విధంగా మాత్రమే చూసి ఉంటాం. కాకపోతే ప్రస్తుతం ప్రపంచం మొత్తం రోజుకో టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందింది. ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని చేసే ప్రతి పనిని చాలా సులువుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రోబోస్ ఏకంగా డాన్స్ చేసే స్థాయికి వచ్చేసాయి. అమెరికాకు చెందిన ‘ బోస్టన్ డైనమిక్స్ ‘ అనే కంపెనీ కుక్కల ఆకారంలో ఉన్న రోబోలను తయారుచేసి వాడితో డాన్స్ చేపించి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also read: Danush 50: ‘రాయన్‌’ దిగుతున్నాడు గెట్ రెడీ.. ఇట్స్ అఫీషియల్‌..

ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా ఈ వీడియోని విడుదల చేసింది కంపెనీ. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2 మిలియన్స్ వ్యూస్ ను పైగా సొంతం చేసుకుంది. ఇక ఈ వీడియోకి బోస్టన్ డైనమిక్స్ కంపెనీ సరదాగా ‘మా స్పాట్ మరో విచిత్ర కుక్కను కలుసుకుంది. డ్యాన్స్ కు ఉన్న అపార శక్తిని జోడించి దానితో స్నేహం చేయాలనుకుంటోంది. కుక్క వేషధారణతో ఉన్న స్పార్కల్స్ ను చూడండి. కేవలం స్పాట్ కోసం ముస్తాబైన కస్టమ్ మేడ్ కాస్టూమ్ డాగ్ ఇది’ అంటూ ఓ క్యాప్షన్ ను జోడించింది.

Also read: Jasprit Bumrah: ప్రేమతో స్పెష‌ల్‌ బ‌ర్త్‌డే విషెస్‌ చెప్పిన బుమ్రా.. ట్వీట్ వైర‌ల్..

ఇక ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ముందుగా స్పార్కల్స్, మరోవైపు స్పాట్ రోబో కుక్క కాస్త ఎదురుగా నిలుచుకుని ఒకదాని ఒకటికి కాస్త విచిత్రంగా చూసినట్లుగా కనపడతాయి. ఆ తర్వాత.. స్పార్కల్స్ కుక్క రోబో, స్పాట్ కుక్క రోబోకు స్నేహహస్తం అందిస్తున్నట్లుగా ముందటి కాలను చూపిస్తుంది. కాకపోతే స్పాట్ రోబో వాటికి స్పందించకపోవడంతో నాలుగు కాళ్లు ఆడిస్తూ డాన్స్ చేసింది. దాంతో ఎగిరి గంతేసిన స్పాట్ రోబో కూడా దానితో జత కలిసి రెండు రోబోలు ముక్కుతో వాసనను పసిగట్లగా దగ్గరకు వచ్చి ఆ వెంటనే దూరంగా వెళ్లిపోతాయి. బ్యాగ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ అనుకూలంగా ఈ రెండు రూపాలు అసాధారణమైన డాన్స్ చేయడంతో ప్రస్తుతం వీడియో పాపులర్ గా మారింది.