NTV Telugu Site icon

Robert Vadra : మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో తొలిసారిగా రాబర్ట్ వాద్రా పేరు

New Project 2023 12 27t072231.251

New Project 2023 12 27t072231.251

Robert Vadra : ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా మరో సారి చిక్కుల్లో పడ్డారు. ఆయుధ వ్యాపారి, పరారీలో ఉన్న సంజయ్ భండారీపై ఈడీలో కొనసాగుతున్న కేసులో రాబర్ట్ వాద్రా చిక్కుకున్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో తొలిసారిగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు కూడా ప్రస్తావించబడిండి. ఆయనతో పాటు సంజయ్ భండారీ సన్నిహితులు సీసీ తంపి, సుమిత్ చద్దాలపై ఈడీ ఢిల్లీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీసీ థంపి యూఏఈ ఎన్ఆర్ఐ, సుమిత్ చద్దా లండన్ పౌరుడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు సీసీ థంపీ, రాబర్ట్ వాద్రాల మధ్య డబ్బు లావాదేవీలే కాకుండా లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను సీసీ థంపి రాబర్ట్ వాద్రా కోరిక మేరకు పునరుద్ధరించారని ఈడీ కోర్టుకు తెలిపింది. లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్‌తో సహా అనేక అప్రకటిత విదేశీ ఆస్తులను సంజయ్ భండారీ కలిగి ఉన్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రెండు ఆస్తులు మనీ లాండరింగ్, 2002 నిబంధనల ప్రకారం నేరం ద్వారా వచ్చిన ఆదాయం నుండి పొందబడ్డాయి. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు.

Read Also:IND vs SA: సెంచూరియన్‌ టెస్టులో పోరాడుతున్న కేఎల్‌ రాహుల్‌.. భారత్ స్కోర్ 208/8!

జూన్ 1, 2020న సంజయ్ భండారీ, అతని 3 కంపెనీలు, సన్నిహితులు సంజీవ్ కపూర్, అనిరుధ్ వాధ్వాపై ఈడీ ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. ఆ తర్వాత ప్రత్యేక ఇడి కోర్టు సంజయ్ భండారీని పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. లండన్ అడ్మినిస్ట్రేషన్ సంజయ్ భండారీని అప్పగించాలని ఆదేశించింది. అయితే భండారి అప్పగింత ఉత్తర్వును సవాలు చేస్తూ లండన్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఏజెన్సీ అటాచ్ చేసింది.
సీసీ థంపీ రాబర్ట్ వాద్రాకు అత్యంత సన్నిహితుడు అని ఈడీ విచారణలో తేలింది. రాబర్ట్ వాద్రా లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్‌లోని ఫ్లాట్‌ను సుమిత్ చద్దా ద్వారా పునరుద్ధరించడమే కాకుండా, అదే ఇంట్లో చాలాకాలం నివసించారు. ఇది కాకుండా, రాబర్ట్ వాద్రా, సిసి తంపి కలిసి ఫరీదాబాద్‌లో పెద్ద మొత్తంలో భూమిని కొనుగోలు చేశారని, ఒకరి ఖాతాలోకి మరొకరు భారీగా డబ్బును బదిలీ చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి.

Read Also:Health Tips : కివీ పండ్లను ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది మీకోసమే..