Site icon NTV Telugu

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్..!

Accident

Accident

Road Accident: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో ఈ రోజు (జులై 26) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై కాలేజ్‌కు తీసుకెళ్తున్న కూతురు మైత్రి(19), తండ్రి మచ్చందర్(55)ను ఓ ట్యాంకర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలోని మృతులు షాద్ నగర్‌కు చెందినవారిగా గుర్తించారు. మైత్రిని కాలేజ్‌కు పంపించేందుకు మచ్చందర్ బైక్‌పై తీసుకెళ్తుండగా.. షాద్ నగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ వారి పైకి దూసుకొచ్చింది. ఆలా వాహనం ఢీకొన్న తాకిడికి ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Leopard Attack Tirumala: తిరుపతిలో బైక్‌ ప్రయాణికులపై చిరుత దాడికి యత్నం.. భక్తుల్లో భయాందోళన!

రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికి ఇచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. మైత్రికి వస్తున్న తన స్నేహితురాల ఫోన్లో ఇతరుల ఫోన్లకు తయ్యబ్ సమాచారం తెలియజేశారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్ నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సీఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. భౌతికకాయలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వానలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
OPPO Reno14 5G: అమ్మకాల్లో సంచనాలను సృష్టిస్తున్న ఒప్పో Reno 14.. కొత్త మింట్ గ్రీన్ కలర్ వేరియంట్ లాంచ్..!

Exit mobile version