Site icon NTV Telugu

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. వాహనం బోల్తా, 17 మంది మృతి

Aeke

Aeke

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికుల పికప్ వాహనం బోల్తా పడి 17 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వాహనం బోల్తా ఘటనలో 17 మంది మృతి చెందారని.. మరో ఎనిమిది మంది గాయపడ్డారని.. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు కవార్ధా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Kangana Ranaut: స్పితిలో కంగనా రనౌత్‌ ఎన్నికల ప్రచారం.. ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు

కవర్ధాలో కార్మికులతో కూడిన పికప్‌ వాహనం బోల్తా పడి 17 మంది మృతి చెందిన వార్త చాలా బాధాకరమని ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ అన్నారు. కార్మికుల మృతిపై విచారం వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలందరికీ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక యంత్రాంగం సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. అలాగే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని విజయ్ శర్మ హామీ ఇచ్చారు.

Exit mobile version