అమెరికాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి గుర్రపు శైలేశ్ దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ గ్రామానికి చెందిన గత సెప్టెంబర్ లో ఉన్నత చదువుల కోసం శైలేశ్ అమెరికాకు వెళ్లారు. అక్కడ బయోమెడికల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అయితే న్యూ జెర్సీలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ లో మాస్టర్ ఆ బయో మెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు శైలేష్.
Also Read: Viral Video: నెట్టింటిని షేక్ చేస్తున్న పాన్ దోస.. ఇదేక్కడి విడ్డూరం రా బాబు..!
శనివారం శైలేష్ కారులో వెళుతుండగా న్యూజెర్సీలోని సెల్టన్ కూడలి వద్ద మరోవైపు నుంచి వచ్చిన కారు నేరుగా పెట్రోల్ ట్యాంకును ఢీకొంది. దీంతో, శైలేశ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆయన సజీవ దహనమయ్యారు. శైలేశ్ మరణంతో ఆయన స్వగ్రామం బడా భీంగల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. శైలేష్ తండ్రి గతంలో గల్ఫ్‌కు వెళ్లివచ్చారు. ఆయన తల్లి గృహిణి. శైలేశ్ కు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. దీంతో శైలష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వానికి మృతుని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Online Fraud: అమ్మాయి అడిగిందని న్యూడ్ ఫోటోలు పంపాడు.. తీరా చూస్తే?
