హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ దగ్గర ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చి కారు ఇసుక లారీ ఢీ కొన్నాయి.. కారులో ప్రయాణిస్తున్న ఏటూరు నాగరంకు చెందిన నలుగురు మృతి చెందారు.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరు నాగారం నుంచి వేములవాడ దైవదర్శనానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Salaar Review: ప్రభాస్ ‘సలార్’ మూవీ రివ్యూ!
ఈ ప్రమాదంలో మరణించిన వారు మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్(60), మంతెన భారత్ (29), మంతెన చందన(16) ఉన్నారు. యాక్సిడెంట్లో మంతెన రేణుక, భార్గవ్, శ్రీదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. వారికి చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నలుగురు మృతదేహాలను సైతం ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇక, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.