NTV Telugu Site icon

Road Accident: మద్యం మత్తులో బైక్‌ ను గుద్దేసిన ఎస్‌యూవీ.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

Road Accident

Road Accident

Road Accident: ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఢిల్లీ ప్రభుత్వ అధికారి తన SUV కారుతో బైక్‌ను ఢీకొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢీకొన్న తర్వాత కారు, బైక్‌లు దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల తర్వాత ఝండేవాలన్ ప్రాంతంలోని రాణి ఝాన్సీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌యూవీ డ్రైవర్‌ ను ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్‌సి మీనాగా గుర్తించారు. ఈ ఘటనలో రాపిడో బైక్ నడుపుతున్న యువకుడు ఆసుపత్రిలో చేరాడు.

Bangladesh PM Resign: బంగ్లాదేశ్ ప్రధాని రాజీనామా.. ఆర్మీ చేతుల్లోకి పాలన..!

మీనా తన క్రెటా ఎస్‌యూవీని అత్యంత వేగంతో నడుపుతూ రాపిడో బైక్‌ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బైక్ కారులో ఇరుక్కుపోయి చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఆ తర్వాత రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అయితే మంటలు చెలరేగకముందే డ్రైవర్లు ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు. అనంతరం అగ్నిమాపక శాఖ మంటలను ఆర్పింది. పోలీసులు మీనాను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన బెయిల్ పొందాడు.

ICC Player Of Month: జూలై నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా టీమిండియా ఆల్‭రౌండర్..

అందిన సమాచారం ప్రకారం, ప్రమాద సమయంలో మీనా తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రమాదానికి కారణమైనందుకు అతనిపై కేసు నమోదు చేశారు. విచారణలో రాపిడో బైక్‌ డ్రైవర్‌కు లైసెన్స్‌ లేదని కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో బైక్ డ్రైవర్‌ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసుల అధికారులు తెలిపారు.

Show comments