రోడ్డు ప్రమాదాలు విషాదం నింపుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది కారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందాడు. కారులో ఉన్న మహిళ తో పాటుగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదేసమయంలో మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్ళింది కారు. గాయాల పాలయిన మోటార్ సైకిలిస్ట్ ను హైవే అంబులెన్స్ లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హైవే సిబ్బంది. ప్రమాదం కారణంగా కారు నుజ్జునుజ్జయింది.
శ్రీకాళహస్తిలో ప్రమాదం… కారు డ్రైవర్ మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారును ఢీకొంది లారీ. కారు డ్రైవర్ మృతి. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.