NTV Telugu Site icon

Road Accident: లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకుంటూ.. వీడియో వైరల్..

7

7

రోడ్డుమీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మనం రోడ్డుపై తగు జాగ్రత్తలు తీసుకొని నడుపుతున్న ఎదుటివారి వల్లనో.. మరి ఏదో విషయం వళ్లనో మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే తాజాగా హైదరాబాదులో ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఒక బైక్ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుక కెళ్ళింది.

Also read: Rukshar Dhillon: మత్తికించే కళ్ళతో పిచ్చెక్కిస్తున్న రుక్సార్ ధిల్లాన్…

ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కర్మన్ ఘాట్ వద్ద జరిగింది. ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తీసుకోవచ్చున ఈ భాగోతం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొదట ఓ కారును ఢీ కొట్టిన లారీ డ్రైవర్ నుంచి తప్పించుకోవడమే భాగంలో ముందుకు వెళ్తున్న సమయంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దాంతో అక్కడ స్థానికులు కొడతారన్న భయంతో లారీని ఆపకుండా వేగం పెంచి దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ముందుకు వెళ్లాడు. ఈ సంఘటనలో టూ వీలర్ చొదకుడు హఫీజ్ ప్రాణాలు కాపాడుకునేందుకు లారీ క్యాబిన్ ని పట్టుకొని అప్రమత్తంగా వ్యవహరించాడు.

Also read: Bethi Subash Reddy: నేను ఈటలకు మద్దతు ఇస్తా.. బీఆర్ఎస్ కు భేతి సుభాష్ రెడ్డి గుడ్ బై..

లారీ ఢీ కొట్టగానే లారీ పైకి ఎక్కి డోర్ పట్టుకొని హఫీజ్ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా.. అవేమి తనకు పట్టనట్టుగా లారీని రెండు కిలోమీటర్ల వరకు డ్రైవర్ తీసుకెళ్లాడు. లారీ బ్యానెట్ పైన నిలబడి ఆపాలంటూ ఎంత అరిచినా దాన్ని డ్రైవర్ వినకుండా ముందుకు వెళ్లాడు. ఇకపోతే ఈ సంఘటన సమయంలో అటువైపుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ లారీని కొంతమంది బైకర్స్ వెంబడించగా ఎల్బీనగర్ వైపు వెళ్లి చివరికి వనస్థలిపురం వద్ద లారీని ఆపేశాడు. ఆ తర్వాత డ్రైవర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో లొంగిపోగా బాధితుది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.