Site icon NTV Telugu

Mounika: యూత్ పార్లమెంట్లో తెలంగాణ విద్యార్థిని మౌనిక అద్భుత ప్రసంగం

Delhi

Delhi

ఇవాళ గుడ్ గవర్నెన్స్ డే. ఈసందర్బాన్ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్ లో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి నుంచి ఎంపికైన విద్యార్థిని కే .మౌనిక ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన యూత్ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి మరియు దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది నేడు అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడే అవకాశం లభించగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆమెను అభినందించారు.

Read Also: Pakistan: బలూచిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు.. ఐదుగురు సైనికులు దుర్మరణం

కామారెడ్డి జిల్లాలోని ఒక మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి కే. మౌనిక వారి తండ్రి డీసీఎం డ్రైవర్ గా వారి తల్లి బీడీలు చుట్టూతూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు అందులో మొదటి అమ్మాయి. చిన్నప్పటినుండే సివిల్స్ ర్యాంకు సాధించాలి అనే పట్టుదలతో ఉంది. ఈరోజు పార్లమెంటులో ప్రసంగించినందుకు తెలంగాణ నుండి ఒకే విద్యార్థిని కి అవకాశం దొరకడం గర్వపడుతున్నారు.ఈ క్రమంలో కామారెడ్డి లోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని అదే కళాశాలలో పీజీ చదువుతున్నది.తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా పెంపొందించినందుకు మౌనికను మరియు వారి తల్లిదండ్రులను, ఆర్ కె కళాశాల కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి మరియు అధ్యాపకులను అభినందించారు.

Read Also: Off The Record: గుమ్మనూరు చుట్టూ వివాదాలు

Exit mobile version