Site icon NTV Telugu

RJ Shekar Basha: టాలీవుడ్ హీరో భార్యపై శేఖర్ బాషా కంప్లైంట్..

Rj Shekar Basha

Rj Shekar Basha

RJ Shekar Basha: టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సోమవారం బిగ్ బాస్ ఫేమ్ RJ శేఖర్ బాషా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హీరో ధర్మ మహేష్‌కి సపోర్ట్ గా మాట్లాడిన కారణంగా గౌతమి తనను టార్గెట్ చేస్తుందని చెప్పారు. బీహార్ రౌడీలను పంపించి తనను చంపిస్తానని గౌతమి బెదిరిస్తుందని అన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాగే తన తల్లి, కూతురుపై కూడా గౌతమి అభ్యంతకర వ్యాఖ్యలు చేసిందని శేఖర్ బాషా తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గౌతమిపై BNS 351(3) 352 , 67 IT Act కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

READ ALSO: CM Chandrababu : పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం !

శేఖర్ బాషా విషయానికి వస్తే ఆయన రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య వ్యహారంలో చేసిన ఆరోపణలు అప్పట్లో చర్చనీయాశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లావణ్య డబ్బులు కోసమే ఇదంతా చేస్తుందని శేఖర్ బాషా ఆరోపంచారు. ఈ నేపథ్యంలో శేఖర్ భాషపై లావణ్య కేసు కూడా పెట్టింది. ఆ వ్యవహారం ఓ వైపు నడుస్తూ ఉండగా ఆయనపై మరో కేసు కూడా నమోదు అయింది. హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో ఆయనపై ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ షష్టి వర్మ ఫిర్యాదు చేసింది.

ఆ మధ్య ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన షష్టి వర్మ శేఖర్ బాషాపై కూడా కేసు పెట్టింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్ రికార్డు లీక్ చేశాడని శేఖర్ బాషాపై షష్టి వర్మ ఫిర్యాదులో పేర్కొంది. తన పరువుకు భంగం వాటిల్లేలా, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో మాట్లాడుతున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఉద్దేశ పూర్వకంగా, దురుద్దేశంతో ప్రైవేటు కాల్ రికార్డ్‌లు లీక్ చేశాడని FIR లో పేర్కొన్నారు. పోలీసులను శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్‌తోపాటు, ఆయనతో ఉన్న ఇతర ఎలక్ట్రానిక్ డివైజస్‌లు సీజ్ చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.

READ ALSO: Mrunal Thakur: స్టార్ క్రికెటర్‌తో డేటింగ్‌ రూమర్స్‌.. స్పందించిన మృణాల్‌

Exit mobile version