Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. రితేష్ దేశ్‌ముఖ్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెనీలియా దేశ్‌ముఖ్ తన సొంత బ్యానర్ ‘ముంబై ఫిల్మ్ కంపెనీ’పై నిర్మించారు. మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే మొదట మరాఠీలో రూపొందించినప్పటికీ, ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేస్తున్నారు. శివాజీ మహారాజ్ చరిత్రకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ ఉండటంతో ఇక్కడ కూడా భారీగా థియేటర్లను కేటాయిస్తున్నారు. అయితే..
తాజాగా జెనీలియా సోషల్ మీడియా వేదికగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు ప్రకటించారు. ‘మరో కొత్త ఆరంభం.. హిందూ స్వరాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక కథ ఇది. ఈరోజే మీ టికెట్లను బుక్ చేసుకోండి’ అంటూ ఆమె మరాఠీ భాషలో ట్వీట్ చేస్తూ అభిమానులను కోరారు. ఈ ట్వీట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శివాజీ మహారాజ్ పాత్రలో నటించడం, ఆ సినిమాకు దర్శకత్వం వహించడం రితేష్ దేశ్‌ముఖ్ కెరీర్‌లోనే అతిపెద్ద కల. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమించారు.కాగా ఈ చిత్రానికి అజయ్-అతుల్ మరియు సంతోష్ నారాయణన్ సంగీతం అందించడం విశేషం. పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ యుద్ధ సన్నివేశాల కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దించారు.
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
తాజావార్తలు
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
-
Telangana DEO : తెలంగాణలో 4 జిల్లాలకు కొత్త డీఈఓలు.. ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగింత
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!