Site icon NTV Telugu

Rishi Sunak: రిషి సునక్ దంపతుల “గో పూజ”.. వీడియో వైరల్

Rishi Sunak

Rishi Sunak

Rishi Sunak and wife perform ‘gau pooja’ in London, video goes viral: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న రిషి సునక్.. హిందూ ఆచారాలను పాటిస్తారని అందరికీ తెలుసు. కుటుంబ సమేతంగా హిందూ పండగలను జరుపుకుంటారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ ఏం చేసినా.. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా రిషిసునక్, అతని భార్య అక్షతా మూర్తి కలిసి ‘గో పూజ’లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో బ్రిటన్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రిషి సునక్, భార్య అక్షత పక్కన నిలబడి ఆవు ముందు హారతి ఇవ్వడం కనిపిస్తోంది. ఆవుకు పవిత్ర జలాన్ని అందిస్తుండటం చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో పలువురిని ఆకర్షిస్తోంది.

ఇటీవల శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడానికి రిషిసునక్ లండన్ శివార్లలో ఉన్న భక్తి వేదాం మనోర్ ని సందర్శించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు గో పూజ వీడియో బయటకు వచ్చింది. ఆ సమయంలో తాను, తన భార్య అక్షతో కలిసి జన్మాష్టమిని జరుపుకోవడానికి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించమాని సోషల్ మీడియాలో రిషి సునక్ పోస్ట్ చేశారు.

Read Also: Central Governement: ప్యాకెట్‌లో ఎంత నూనె ఉందో కచ్చిత సమాచారం ముద్రించాలి.. ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు

భారత సంతతి వ్యక్తి తొలిసారిగా బ్రిటన్ పీఎం రేసులో నిలబడ్డారు. లిజ్ ట్రస్ తో బ్రిటన్ పీఎం, కన్జర్వేటివ్ పార్టీ అధినేత ఎన్నికల పోటీలో తలపడుతున్నారు. 42 ఏళ్ల రిషి సునక్ ఫిబ్రవరి 2020 నుంచి జూలై 2022 మధ్య బ్రిటన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి లిజ్ ట్రస్ తో పోటీలో ఉన్నారు. సెప్టెంబర్ 5తో బ్రిటన్ ప్రధాని పదవి ఎవరి సొంతం అవుతుందో తేలుతుంది.

వరస కుంభకోణాలు, అవినీతి ఆరోపణలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. వరసగా మంత్రులు బోరిస్ జాన్సన్ మంత్రి వర్గం నుంచి వైదొలుగుతుండటంతో మరో గత్యంతరం లేక ఆయన తన పీఎం పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం లిజ్ ట్రస్ కన్నా రిషి సునక్ వెనకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version