NTV Telugu Site icon

Rishabh Pant: ‘స్టుపిడ్’ అంటూ రిషబ్ పంత్‌పై విరుచకపడ్డ గవాస్కర్

Rishab Pant

Rishab Pant

Rishabh Pant: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బాట్స్మన్ రిషభ్ పంత్ మరోసారి తన ఆటపై విమర్శలకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఒక కీలక దశలో ఉన్నప్పటికీ, పంత్ తన మార్క్ షాట్‌ను ఆడేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యాడు. మ్యాచ్‌లో బోర్డన్ బౌలింగ్‌లో పంత్ ర్యాంప్ షాట్‌ను కొట్టేందుకు ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. ఈ షాట్‌పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించారు. “స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్ షాట్ అంటూ.. అతడు భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లొద్దు. ఇతర డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాలి” అని గావస్కర్ వ్యాఖ్యానించారు. గావస్కర్ ఈ షాట్‌ను “అత్యంత చెత్త షాట్” అని అభివర్ణించాడు. ఆయన తన వ్యాఖ్యలు ఇంకా కొనసాగిస్తూ, “భారత ఇన్నింగ్స్‌లో అనవసర షాట్లు ఇంకా రన్నింగ్ చోటుచేసుకున్నాయి. క్లిష్ట సమయాల్లో ఇలాంటి చెత్త షాట్లను ఆడాల్సిన అవసరం ఏముంది? అంటూ ప్రశ్నించారు.

Also Read: Nitish Kumar Reddy: తగ్గేదేలే.. పుష్ప స్టైల్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెలెబ్రేషన్స్ అదుర్స్..

అంతేకాకుండా, సునీల్ గావస్కర్ టెస్టు క్రికెట్ గురించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. “ఇది టీ20, 50 ఓవర్ల క్రికెట్ కాదు. టెస్టు క్రికెట్‌లో ఓర్పు చాలా కీలకం. రిషభ్ పంత్ అలాంటప్పుడు ఆచితూచి అలాంటి షాట్లను ఆడాలి. ఫీల్డర్లను ఆ ప్రాంతంలో మోహరించినప్పుడు, అతనికి ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉంది” అని గావస్కర్ పేర్కొన్నారు. పంత్ తన లెగ్ సైడ్‌లో షాట్ కొట్టాలని ప్రయత్నించినప్పటికీ, అది ఎడ్జ్ తీసుకుని ఆఫ్‌సైడ్‌కు వెళ్లిపోయింది. ఇది కాస్త దురదృష్టంగా ఉందని గావస్కర్ అన్నారు. ఇలాంటి షాట్ల ఎంపిక ఇప్పుడు అవసరం లేదని, ఫీల్డర్లను డీప్ ప్లేస్‌మెంట్‌లో పెట్టినప్పుడు మరో విధంగా ఆడాల్సింది అని ఆయన సూచించారు. ఇది పంత్ క్రికెట్ కెరీర్లో మరొక వివాదాస్పద సంఘటనగా మారింది. ముఖ్యంగా భారత జట్టు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ అతను ఇలాంటి షాట్ ఆడడంతో విమర్శలు ఎదురుకుంటున్నాడు.

Show comments