Site icon NTV Telugu

Ind vs Eng: ఐదో టెస్టుకు పంత్‌ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్

Panth

Panth

మాంచెస్టర్‌లో భారత, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు సిరీస్ హీరో పంత్‌ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐదవ టెస్ట్ కు దూరమయ్యాని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. బోర్డు 5వ టెస్ట్ కు కొత్త జట్టును కూడా ప్రకటించింది. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా కుడి కాలుకి గాయం కారణంగా రిషబ్ పంత్ ఐదవ మరియు చివరి టెస్ట్‌కు దూరమైనట్లు బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో 2025 జూలై 31న ప్రారంభమయ్యే ఐదవ టెస్ట్ కోసం రిషబ్ పంత్ స్థానంలో నారాయణ్ జగదీశన్‌ను పురుషుల సెలక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది.

Also Read:Dhanush : ఇడ్లీ కొట్టు నుండి మొదటి సింగిల్‌ రిలీజ్..

టెస్ట్ సిరీస్‌లో పంత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. 4 టెస్ట్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 68.42 సగటు, 77.63 స్ట్రైక్ రేట్‌తో 479 పరుగులు చేశాడు. ఈ సమయంలో, భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ 3 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా పంత్ కొనసాగుతున్నాడు. నాల్గవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పంత్ కాలి వేలుకు గాయమైంది. అతను రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అనంతరం రెండో రోజు బరిలోకి దిగిన రిషభ్‌ గాయం వేధిస్తున్నప్పటికీ అర్ధశతకం (54) చేశాడు.

Also Read:Ind vs Eng, 4th Test: డ్రాగా ముగిసిన నాలుగో టెస్ట్.. సుందర్-జడేజా చారిత్రాత్మక ఇన్నింగ్స్

ఐదో టెస్ట్ కు భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ కశ్దీప్, అకుల్ దీప్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఎన్ జగదీసన్ (వికెట్ కీపర్).

Exit mobile version