Site icon NTV Telugu

Rishabh Pant: పంత్ సూపర్ సెంచరీ.. గ్రౌండ్ లోనే స్పైడర్ మ్యాన్ లా పల్టీలు కొట్టి సెలబ్రేషన్స్

Pant

Pant

ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో సతమతమవుతున్న రిషబ్ పంత్.. ఈ సీజన్‌లో తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సెంచరీ సాధించాడు. సీజన్ అంతా పంత్ ఫామ్‌లో లేడు, కానీ మంగళవారం జరిగిన చివరి మ్యాచ్‌లో తన నిజమైన ఫామ్‌ను చూపించాడు. గత మ్యాచ్ లలో ఇదే ఊపుతో ఆడి ఉంటే లక్నో పరిస్థితి వేరేలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read:TDP Mahanadu: అట్టహాసంగా మహానాడు.. ఆరు ప్రధాన అంశాలు సభ ముందుకు..

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో, పంత్ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి మూడవ స్థానంలోకి వచ్చాడు. ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడి ఊచకోత కోశాడు. సిక్సులు ఫోర్లతో పరుగుల వరదపారించాడు. కేవలం 54 బంతుల్లోనే సెంచరీ(100) పూర్తి చేశాడు. పంత్ 61 బంతుల్లో 11 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

Also Read:UPSC Aspirant Suicide: వైఫల్యాల ఒత్తిడి.. ఆత్మహత్య చేసుకున్న సివిల్స్ అభ్యర్థి..

సెంచరీ చేసిన తర్వాత, పంత్ తన హెల్మెట్ తీసి బ్యాట్ చూపించి కింద పెట్టాడు. ఈ సమయంలో, అందరి మదిలో పంత్ ఏమి చేయబోతున్నాడనే ప్రశ్న మెదిలింది. ఆ తర్వాత పంత్ స్పైడర్ మ్యాన్ లాగా గ్రౌండ్ లోనే పల్టీలు కొట్టి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది చూసి గ్రౌండ్ లో ఉన్న వారందరూ నవ్వడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

Exit mobile version