Site icon NTV Telugu

Riddhi: ప్రభాస్‌తో ఛాన్స్.. ప్రాంక్ అనుకున్నా

Riddhi Kumar Prabhas, The Raja Saab

Riddhi Kumar Prabhas, The Raja Saab

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌తో పాటు రిద్ధి కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం దక్కడం తనకు నిజంగా ఒక సర్ప్రైజ్‌లా అనిపించిందని రిద్ధి వెల్లడించింది.

Also Read : Tamannaah Bhatia : బోని కపూర్ అనుమతిస్తే.. తమన్నా కల నెరవేరినట్లే

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రిద్ధి మాట్లాడుతూ.. “ఒక రోజు అకస్మాత్తుగా నిర్మాత ఎస్‌కెఎన్ సర్ నాకు కాల్ చేశారు. ‘ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నాం. అందులో ముగ్గురు హీరోయిన్ రోల్స్ ఉన్నాయి. నీకు ఒక మంచి పాత్ర ఇవ్వాలని అనుకుంటున్నాం’ అని చెప్పారు. నిజం చెప్పాలంటే, ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారనిపించింది. ఇది ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా,” అంటూ నవ్వుకుంది. తర్వాత విషయం క్లారిటీ కోసం మేనేజర్‌ను అడిగినపుడు అది నిజమే అని తెలిసిన క్షణంలో తన ఆనందానికి హద్దులు లేకపోయాయని చెప్పింది. “అది నిజమని తెలిసిన వెంటనే హృదయం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నట్టు అనిపించింది. ప్రభాస్ సర్‌తో నటించే అవకాశం దొరకడం నా కెరీర్‌లో పెద్ద మైలురాయి,” అని రిద్ధి భావోద్వేగంగా తెలిపింది. ‘ది రాజాసాబ్’లో తన పాత్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేసింది. మరి ఈ సినిమా ఆమె కెరీర్‌కు ఎంత బూస్ట్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version