Aghori-Sri Varshini: ఇక నా జోలికి వస్తే అంతే సంగతి.. అఘోరీకి శ్రీ వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aghori-Sri Varshini: అఘోరీ అలియాస్ శ్రీనివాస్, శ్రీ వర్షిణి టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో వీరిద్దరికి వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా మళ్లీ ఇద్దరికి సంబంధించిన ఇంటర్వ్యూలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలు కేసులపై ఇటీవల అరెస్ట్ అయిన అఘోరీ అలియాస్ శ్రీనివాస్ ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చాడు. అనంతరం పలు మీడియా సంస్థలతో మాట్లాడాడు. జైలు జీవితం, ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్తులో చేయాలనుకుంటున్న అంశాలను పంచుకున్నాడు. మరోవైపు.. శ్రీ వర్షిణికి సంబంధించిన పలు వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. ఓ మీడియా సంస్థతో తాజాగా శ్రీ వర్షిణి మాట్లాడుతూ.. శ్రీనివాస్‌ను గట్టిగానే హెచ్చరించింది. తన జోలికి వస్తే బాగుండదని తేల్చి చెప్పింది.
READ MORE: Saif Ali Khan : ఆమెకు ముద్దు పెడితే వెయ్యి ఇచ్చేది.. సైఫ్ అలీ ఖాన్ కామెంట్స్
Also Read
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్‌కు శ్రీ వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. “నేను శ్రీనివాస్‌కు ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నాను. నన్ను కలవాలి, మళ్లీ కాంటాక్ట్ అవ్వాలి అనే అంశాన్ని మైండ్‌లో నుంచి తీసెయ్.. మీడియా ముందు మాట్లాడి మళ్లీ ఏదో చేయాలి అనుకోకు. నువ్వు కోల్పోయింది పది శాతం అయితే.. నేను మాత్రం నా జీవితాన్నే కోల్పోయాను. ప్రస్తుతం నేను బయట తలెత్తుకొని తిరగలేక పోతున్నాను. అలాంటి పరిస్థితిలోకి నువ్వు నన్ను తీసుకెళ్లావు. నన్ను ఒక ఊబిలోకి పారేశావు. నాకు ఇప్పుడే తెలివి వచ్చింది. ఇప్పుడు నేను ఆ ఊబిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తు్న్నాను. నువ్వు ఎలాంటోడివి? ఏం చేశావు? ఎలాంటి మాటలు చెప్పావు? తెలుసుకున్నాను కాబట్టి ఆ ఊబిలో నుంచి మెల్లగా బయటకు వస్తున్నాను. అలాగే.. నువ్వు ఇంకోసారి ఏ మీడియాతో అయినా మాట్లాడినా మంచిగా ఉండదు.. నీకు తొందర్లోనే రియాక్షన్ ఇస్తాను. దానికోసం వేయిట్ చేస్తూ ఉండు. ఇంకోసారి నా గురించి బ్యాడ్‌గా మాట్లాడితే బాగుండదు. నీ వల్ల నా ఫ్యామిలీకి నేను చాలా అన్యాయం చేశాను. ఇక నాజోలికి రాకు.. వస్తే బాగుండదు.” అని శ్రీ వర్షిణి ఓ మీడియా సంస్థతో మాట్లాడింది.
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?