Site icon NTV Telugu

RGV : సీఎం జగన్ కు వెరైటీ గా బర్త్ డే విషెస్ చెప్పిన ఆర్జీవి..

Whatsapp Image 2023 12 21 At 10.00.12 Pm

Whatsapp Image 2023 12 21 At 10.00.12 Pm

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన 51 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ కి వైయస్సార్సీపి కార్యకర్తలు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.. మరోవైపు సీఎం జగన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పుకొచ్చారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా వేదికగా సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా తనదైన స్టైల్ లో విషెస్ చెప్పారు.”వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సాధారణంగా నేను ఎవరికీ హ్యాపీ బర్త్డే చెప్పను. కానీ నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ వైఎస్ జగన్. ‘వ్యూహం’ సినిమా తీయడానికి కూడా ఆయనే నాకు ఎంతో ఇన్స్పిరేషన్. అందుకే ఆయన జన్మదినం కన్నా ఈ సినిమా తీసినందుకు నాకు నేను శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను” అంటూ రాంగోపాల్ వర్మ తెలిపారు. దీంతో జగన్ బర్త్ డే సందర్భంగా వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి.

ఇక వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వ్యూహం’ సినిమా తో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా మారాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ . ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటించిన అజ్మల్ అమీర్ నటించగా.. జగన్  భార్య భారతి పాత్రలో మానసా రాధాకృష్ణన్ కనిపించనుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అలాగే ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ “యూ” సర్టిఫికెట్ తెచ్చుకున్నట్లు ఆర్జీవి ప్రకటించారు. అలాగే ఈ సినిమా డిసెంబర్ 29 న విడుదల కానున్నట్లు తెలియజేశారు

Exit mobile version