తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇంకా ఎదో ఉంటుంది..అంతు చిక్కని ప్రశ్న వర్మ.. తన రూటే సపరేట్.. అందుకే వర్మకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే వర్మ రాజకీయాలకు సంబందించిన సినిమాలను కూడా తెరకేక్కిస్తూన్నారు.. గతంలో తీసిన సినిమాలు విమర్శలు అందుకున్నా కూడా మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అవుతుంటాడు.. ప్రస్తుతం వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వ్యూహం’.ఇటీవల సినిమాకు సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు..
వైఎస్ జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమాను తీస్తున్నారు. రెండు పార్ట్‌లలో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యూహం 1, వ్యూహం 2తో ప్రేక్షకులముందుకు తెస్తున్నారు. అయితే వర్మ ఏం చూపించబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.. ఈ క్రమంలో కొన్ని ఛానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లలో సినిమా గురించి సంచలన విషయాలను పంచుకున్నారు.. ఇక వ్యూహం మొదటి పార్ట్‌లో 2009 నుంచి 2014 ఎన్నికల వరకు సీఎం జగన్ జీవితం ఎలా సాగింది. ఆ సమయంలో జరిగిన పరిణామాలు ప్రేక్షకులకు చూపించనున్నట్లు ఆర్జీవీ తెలిపారు. వ్యూహం-2 లో 2015 నుంచి 2023 వరకు జగన్ జీవితంలోని అంశాలను చూపిస్తానని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్‌ను తొక్కేందుకు జరిపిన కుట్రలను సినిమాలో చూపించబోతున్నట్లు ఆర్జీవీ వెల్లడించారు.
సీఎం జగన్ వ్యక్తిత్వం అంటే తనకు చాలా ఇష్టమని.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడని వర్మ చెబుతున్నారు.. ఇక ఇప్పటికే ఈ సినిమా టాకి పార్ట్ పూర్తి చేసిన వర్మ ఇప్పుడు సినిమాను మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. రెండో పార్ట్ ను వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రానున్నాడు..గత ఎన్నికల ముందు కూడా లక్మీస్ ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరోసారి ఎన్నికల సమయంలో జగన్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా సినిమా అంటే జనాల్లో ఆసక్తి పెరుగుతుంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి..