Site icon NTV Telugu

Ram Gopal Varma : పూనమ్ పాండే ఇష్యూ పై స్పందించిన ఆర్జివీ..

Whatsapp Image 2024 02 03 At 6.08.01 Pm

Whatsapp Image 2024 02 03 At 6.08.01 Pm

బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్‍స్టాగ్రామ్‍ ద్వారా వెల్లడించింది.సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు (ఫిబ్రవరి 3) ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు..సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశాననేలా పూనమ్ నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.”నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వేలాది మంది మహిళల విషయంలో నేను ఇలా చెప్పలేను. దీని గురించి ఎలాంటి అవగాహన లేని కారణంగా.. వారు ఏమీ చేయలేకపోయారు. మిగితా క్యాన్సర్లలాగే.. సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా నయం చేసుకోవచ్చని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు చేయాల్సిందల్లా టెస్టులు చేయించుకోవాలి. హెచ్‍వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలి” అని పూనమ్ పాండే వీడియోలో తెలిపారు.

ఈ విషయాన్ని తాము నమ్మలేకున్నామని, చావుతో ఆటలు ఆడడం ఏంటని కొందరు నెటిజన్లు పూనమ్ పాండేను విమర్శిస్తున్నారు. అయితే, ఆమె జీవించే ఉన్నారన్న విషయం సంతోషం కలిగిస్తోందని మరికొందరు స్పందిస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ (RGV) తన స్టైల్‍లో స్పందించారు..అందరి దృష్టిని ఆకర్షించేందుకు నువ్వు పాటించిన పద్ధతి వల్ల కొంత విమర్శలు రావొచ్చు. కానీ ఈ పుకారు వల్ల నువ్వు సాధించిన దాన్ని.. నీ ఉద్దేశాన్ని ఎవరూ కూడా ప్రశ్నించరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ పట్ల చర్చ అంతటా ట్రెండింగ్‍లో ఉంది. నీలాగే నీ మనసు కూడా చాలా అందమైనది. నువ్వు చాలా కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

Exit mobile version