Ram Gopal Varma : పూనమ్ పాండే ఇష్యూ పై స్పందించిన ఆర్జివీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి చెందారని ఆమె టీమ్ శుక్రవారం ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూనమ్ కన్నుమూశారని తెలిపింది. అయితే, తాను బతికే ఉన్నానంటూ పూనమ్ పాండే నేడు (ఫిబ్రవరి 3) ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు..సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరూ చర్చించుకునేందుకే తాను ఇలా చేశాననేలా పూనమ్ నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.”నేను జీవించే ఉన్నా. నేను సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోలేదు. దురదృష్టవశాత్తు, సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వేలాది మంది మహిళల విషయంలో నేను ఇలా చెప్పలేను. దీని గురించి ఎలాంటి అవగాహన లేని కారణంగా.. వారు ఏమీ చేయలేకపోయారు. మిగితా క్యాన్సర్లలాగే.. సర్వైకల్ క్యాన్సర్‌ను కూడా నయం చేసుకోవచ్చని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు చేయాల్సిందల్లా టెస్టులు చేయించుకోవాలి. హెచ్వీపీ వ్యాక్సిన్ వేయించుకోవాలి” అని పూనమ్ పాండే వీడియోలో తెలిపారు.
ఈ విషయాన్ని తాము నమ్మలేకున్నామని, చావుతో ఆటలు ఆడడం ఏంటని కొందరు నెటిజన్లు పూనమ్ పాండేను విమర్శిస్తున్నారు. అయితే, ఆమె జీవించే ఉన్నారన్న విషయం సంతోషం కలిగిస్తోందని మరికొందరు స్పందిస్తున్నారు.తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) తన స్టైల్లో స్పందించారు..అందరి దృష్టిని ఆకర్షించేందుకు నువ్వు పాటించిన పద్ధతి వల్ల కొంత విమర్శలు రావొచ్చు. కానీ ఈ పుకారు వల్ల నువ్వు సాధించిన దాన్ని.. నీ ఉద్దేశాన్ని ఎవరూ కూడా ప్రశ్నించరు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ పట్ల చర్చ అంతటా ట్రెండింగ్‌లో ఉంది. నీలాగే నీ మనసు కూడా చాలా అందమైనది. నువ్వు చాలా కాలం సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
Hey @iPoonampandey the extreme method u employed to draw attention to this issue might attract some criticism , but no one can question ur INTENT nor what u ACHIEVED with this HOAX .. Discussion on cervical cancer is TRENDING all across now 🙏🙏🙏 Your SOUL is as BEAUTIFUL as YOU…
— Ram Gopal Varma (@RGVzoomin) February 3, 2024
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
-
Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!