Site icon NTV Telugu

RGV-Rajamouli : ‘‘నాస్తికుడు వల్ల దేవుడి స్థాయి తగ్గదు” – జక్కన్న తరపున ఆర్జీవీ పంచ్ పోస్ట్ వైరల్

Rajamouli Rgv

Rajamouli Rgv

దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ ఈవెంట్‌లో హనుమాన్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. “దేవుడిని నమ్మను” అని చెప్పిన రాజమౌళిపై కొన్ని హిందూ సంస్థలు, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తుండగా, ఈ ఇష్యూపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. రాజమౌళిని టార్గెట్ చేస్తున్న వారిపై ఆర్జీవీ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యాడు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం నమ్మకపోవడం కూడా ఒక హక్కే అని చెప్పిన ఆయన.. “ఒక దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమాను తీయడానికి గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? భయానక సినిమా తీయడానికి దెయ్యం అవ్వాలా? అయితే దేవుని నమ్మకపోయినా ఆయనపై సినిమా తీయొచ్చు కదా!” అంటూ విమర్శకుల‌పై సెటైర్ వేశాడు. ఇంకా, దేవుడు నాస్తికుల స్థితిని తగ్గించడం లేదని, అసలు సమస్య రాజమౌళి నాస్తికత్వం కాదని.. నమ్మకుండానే ఇంత పెద్ద విజయం సాధించడం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తోందని కౌంటర్ ఇచ్చాడు. “దేవుడు బాగున్నాడు, రాజమౌళి బాగున్నాడు.. అర్థం చేసుకోలేని వాళ్లకే సమస్య” అంటూ ఈ వివాదానికి క్లియర్ ఫుల్ స్టాప్ పెట్టేలా వ్యాఖ్యానించాడు ఆర్జీవీ.

 

Exit mobile version