Site icon NTV Telugu

కేసీఆర్, మోడీ ఇద్దరూ ఒక్కటే… బొమ్మ, బొరుసు లాంటోళ్ళు : రేవంత్

భారత్‌ బంద్‌ లో పాల్గొన్న తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి.. ప్రధాని మోడీ మరియు సీఎం కేసీఆర్‌ లపై నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్, మోడీ వేరు వేరు కాదని… ఒకే నాణెం కు ఉన్న బొమ్మ, బొరుసు లాంటి వాళ్ళని ఫైర్‌ అయ్యారు. దేశాన్ని మోడీ, అమిత్ షా తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని…మన భూమి లో మనమే కూలీలు గా మార్చే కుట్ర జరుగుతోందన్నారు.

అప్పట్లో భారత్ బంద్ కి కెసిఆర్ మద్దతు ఇచ్చారని.. తానో దగ్గర.. కేటీఆర్ ఇంకో దగ్గర ధర్నా లో పాల్గొన్నామని గుర్తు చేశారు. కానీ ఈసారి ఢిల్లీకి వెళ్లి .. మోడిని కెసిఆర్ కలిశారని… అప్పటి నుండి కెసిఆర్ గజ గజ వణుకుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఇవాళ 19 పక్షాలు ఇచ్చిన బంద్ లో పాల్గొన కుండా… ఢిల్లీ లో మోడీ తో విందులో పాల్గొంటున్నారన్నారు. ప్రతీ స్మశానం దగ్గర మోడీ ఫోటో పెట్టాలని… ఎందుకంటే కరోనా చావులకు మోడీ నే కారణమన్నారు. వైన్ షాప్ దగ్గర కెసిఆర్ బొమ్మ పెట్టాలని… ఆయన వైన్‌ కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు.

Exit mobile version