Site icon NTV Telugu

Dasoju Sravan: రాష్ట్రంలో రోజుకు 8 రేప్‌లు..? ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు..

Dasoju Sravan

Dasoju Sravan

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారని.. పోలీసులను తాబేదార్లుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రశ్న, నిరసన కచ్చితంగా ఉండాలన్నారు. తెలంగాణలో ప్రశ్నించడానికి, నిరసన తెలపడానికి హక్కు లేదని.. బీఆర్ఎస్ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల కేసులు పెట్టారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు అనుముల రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. మల్కాజిగిరిలో మెదక్ ఎమ్మెల్యే తన రౌడీ అనుచరులతో వెళ్లి..”ఏయ్ సీఐ ఇటు రా..” అని పిలిచారని తెలిపారు. కారు బానెట్ పై కూర్చుని మెదక్ ఎమ్మెల్యే పోలీసులను కేసులు పెట్టాలని బెదిరించారన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్.. క్రిమినల్స్ కు అడ్డగా మారింది. 43 శాతం క్రైమ్ రేట్ పెరిగిందని ఆరోపించారు.

READ MORE: Supreme Court: భార్య వివాహేతర బంధం పెట్టుకుంటే కేసులే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

“రాష్ట్రంలో 28.9 శాతం. రేప్ ల సంఖ్య పెరిగింది. సగటున రోజుకు 8 రేప్ లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ 41 శాతం పెరిగింది. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు, అతని కొడుకు రౌడీయిజం, గుండాయిజం చేస్తున్నారు. బీసీ, యాదవ సామాజికవర్గం నేతపై మైనంపల్లి అనుచరులు దాడిచేశారు. ఒక టీవీ ఛానెల్ పై దాడి కేసులో గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణిని ఏ25గా చేర్చారు. ఇది ఎంతవరకు సమంజసమో చెప్పాలి. పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణిని బెదిరిస్తున్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి బెడ్ రూమ్ లోకి పోలీసులు వచ్చారని రేవంత్ రెడ్డి సతీమణి గీత రోడ్డుపై ధర్నా చేస్తే వారిపై కేసులు పెట్టలేదు. రీ ట్వీట్ చేసినందుకు శశిధర్ గౌడ్ ను 17 రోజులు జైల్లో పెట్టారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆఫీసుపై, పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, నల్గొండలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై దాడి, సిరిసిల్లలో కేటీఆర్ క్యాంప్ ఆఫీసుపై దాడి, ఖమ్మంలో హరీష్ రావు కాన్వాయ్ పై దాడి చేశారు. రేవంత్ రెడ్డికి చేతకాకపోతే హోంశాఖను వేరేవారికి అప్పగించు. రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. పోలీసులు సిట్ పేరుతో నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు.” అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Uttar Pradesh: ఆ ఎమ్మెల్యేలకి ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లతో క్లాసులు.. ఏం నేర్చుకోబోతున్నారంటే..?

Exit mobile version