తెలంగాణలో విద్యార్ధులు నానా యాతన పడుతున్నారు. వివిధ హాస్టళ్ళలో సరైన వసతులు లేవు. ఆహారం విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. వసతి గృహాలు కాదు.. వసతి గుహలు అంటూ సోషల్ మీడియాలో కేసీఆర్ సర్కార్ పై మండిపడుతున్నారు.
పురుగుల అన్నం.. పాచిపట్టిన నీళ్ళు..
కంటికి నిద్ర కరువు.. కడుపుకు తిండి దొరకదు..
జ్వరమొస్తే పట్టదు.. పాముల నుండి రక్షణ లేదు..
వరుసగా పిల్లల ప్రాణాలు పోతున్నా మనసు కరగదు..
దయలేని ఈ సర్కారును దండించాలా? వద్దా?అంటూ ప్రశ్నిస్తున్నారు. ట్రిఫుల్ ఐటీలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ళలో పిల్లలకు పెట్టే తిండి ఎలా వుందో కేసీఆర్ చూడాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణలో పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారాయి హాస్టళ్ళు. నిరుపేదల తమ పిల్లల్ని హాస్టళ్ళలో చేర్చి మంచి విద్య, వసతి, ఆహారం లభిస్తుందని ఆశిస్తే.. అక్కడి పరిస్థితులు దిగ్భ్రాంతికరంగా మారుతున్నాయి. ఎంతోమంది విద్యార్థులు తల్లిదండ్రులను వదిలేసి ఉజ్వల భవిష్యత్తు కోసం గురుకులాల్లో చేరుతుంటే, అక్కడి వాస్తవ పరిస్థితులు వాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. పురుగుల అన్నం, నీళ్ల చారుతో స్టూడెంట్స్ నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ రేట్లకు అనుగుణంగా మెస్ ఛార్జీలు చెల్లించకపోవడంతో విద్యార్ధులకు సరైన ఆహారం లభించడం లేదు. ఆహారంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్ధులు వాంతులు, విరేచనాలు, అస్వస్థతకు గురవుతున్నారు. ఇటీవల కామారెడ్డి బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ లో 10ఏళ్ళ బాలుడు పాముకాటుకి గురయ్యాడు. కొన్ని హాస్టళ్ళలో టాయిలెట్లు కూడా లేవు. ఇంత జరుగుతున్నా… అధికారులు పట్టించుకోవడం లేదని విపక్షాలు సైతం ఆందోళనకు దిగాయి.
వసతి గృహాలు కాదు.. వసతి గుహలు..
పురుగుల అన్నం.. పాచిపట్టిన నీళ్ళు..
కంటికి నిద్ర కరువు.. కడుపుకు తిండి దొరకదు..
జ్వరమొస్తే పట్టదు.. పాముల నుండి రక్షణ లేదు..
వరుసగా పిల్లల ప్రాణాలు పోతున్నా మనసు కరగదు..దయలేని ఈ సర్కారును దండించాలా? వద్దా?#UdyamaDrohiKCR pic.twitter.com/20YDXkZfli
— Revanth Reddy (@revanth_anumula) September 14, 2022