NTV Telugu Site icon

Revanth Reddy: ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ క్షమాపణ చెబుతారా?

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ ఎన్నికల ముగిశాయి. ఇవాళ పోలింగ్‌కు తెర పడింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కూడా వచ్చేశాయి. అన్నింటిలో కాంగ్రెస్‌దే హవా అన్నట్టుగా ఉంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది. కేసీఆర్ అక్రమ సంపాదనతో ఎన్నికలను ప్రభావితం చేసి శాశ్వతంగా అధికారంలో కొనసాగుతానని అనుకున్నారు. కానీ తెలంగాణ సమాజం అవసరం అనుకున్నప్పుడు చాలా వేగంగా స్పందిస్తుంది. దీన్ని మరోసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు.

Also Read: KTR: మళ్లీ అధికారం మాదే.. ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ స్పందన

కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు కష్ట పడ్డారు… కేసీఅర్‌ను ఇక్కడ ఓడగొట్టారు. శ్రీకాంతాచారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. ఎగ్జిట్ పోల్స్ చూసి కేటీఆర్ వచ్చి భయపట్టే ప్రయత్నము చేశారు. మరి ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెబుతారా?’ అని సవాలు విసిరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఏడు గంటల నుంచి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకొండి. డిసెంబర్ 3 వరకు అగాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లు కూడా దాటవు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ వచ్చింది.

Also Read: Telangana Assembly Elections 2023: ఉత్కంఠరేపుతోన్న ఎగ్జిట్‌ పోల్స్‌.. ఓట్లపై ఆరా తీస్తున్న అభ్యర్థులు..!

కేటీఆర్ వచ్చి మాట్లాడాడు అంటే దుకాణం బంద్ అయినట్టు. కేసీఅర్ మొహం చాటేశారు. కేటీఆర్ ఇక్కడ ఉండడు అమెరికా వెళతాడు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు నిర్ణయాలు ఉంటాయి. నేను మూడు పదవుల్లో ఉన్నా.. నేను ఏ పదవిలో కొనసాగాలి అనేది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం కోసం త్యాగాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో సోనియా, రాహుల్, ప్రియాంకా, ఖర్గెలు కృషి చేశారు. ప్రజల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు.

Show comments