Emirates Draw : లాటరీలో 231 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన చెన్నై వ్యక్తి..!
- పుట్టిన రోజు నాడు లాటరీ టికెట్ కొన్న రిటైర్డ్ ఇంజినీర్
- ఎమిరేట్స్ డ్రా MEGA7 లో ఒక్కసారిగా ₹231 కోట్లు గెలుపు
- “నా సమయం ఇప్పుడు వచ్చింది” .. శ్రీరాం రాజగోపాలన్ భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emirates Draw : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తట్టేస్తుందో చెప్పడం అసాధ్యం. ఒక్కసారి అదృష్టం వరించిందంటే ఓ రాత్రిలోనే జీవితమే మారిపోతుంది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరాం రాజగోపాలన్ కథ కూడా అలాంటిదే. ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ‘ఎమిరేట్స్ డ్రా MEGA7’ లాటరీలో ఏకంగా 231 కోట్లు గెలుచుకుని ఒక్కరాత్రిలో కోటీశ్వరుడిగా మారిపోయాడు. శ్రీరాం రాజగోపాలన్ తన జన్మదినమైన మార్చి 16న ఎమిరేట్స్ డ్రా లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. టికెట్ కొనడం ఆయనకు ఒక ఆటలా అనిపించినా, అది జీవితాన్ని మార్చేసే అవకాశం అవుతుందని ఆయన ఊహించలేదు. MEGA7 ఆటలో ఆయన ఊహాజనితంగా 7 నెంబర్లను ఎంచుకున్నాడు. అయితే, ఆ సంఖ్యలే ఆయనకు కోట్లు తీసుకొచ్చాయి.
Kannappa : ‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..
Also Read
- CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
- KTR: '8+8 = 0'.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
లాటరీ ఫలితాలు చూసిన వెంటనే మొదట శ్రీరామ్‌కు ఇది నిజమేనా అన్న అనుమానం వచ్చింది. ఆయన మాట్లాడుతూ, “డ్రా వీడియోను నేను రెండుసార్లు చూసాను. స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న తర్వాతే నమ్మకం వచ్చింది. ఎలాంటి లాజిక్ పని చేయదు, ఇది పూర్తిగా అదృష్టం,” అన్నారు. అదృష్టాన్ని అందిపుచ్చుకున్న శ్రీరాం, ఆటను జవాబుదారీతనంతో ఆడాలంటూ పిలుపునిచ్చాడు. “నాకు ఇప్పుడు నా సమయం వచ్చింది.
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆశను విడవకండి, ఆటను ఆనందంగా ఆడండి. నా జీవితం ఒక్క రోజులో మారిపోయింది,” అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, శ్రీరాంకు నెట్ బ్రౌజింగ్ అంటే ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫోన్‌లో బ్రౌజింగ్ చేస్తూ గడిపేవారు. అదే సరదాగా మొదలైన ఆన్లైన్ లాటరీ ఆడటం ద్వారా ఆయనకి ఊహించని విజయం లభించింది.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!