Site icon NTV Telugu

Emirates Draw : లాటరీలో 231 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన చెన్నై వ్యక్తి..!

Emirates Draw

Emirates Draw

Emirates Draw : అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తట్టేస్తుందో చెప్పడం అసాధ్యం. ఒక్కసారి అదృష్టం వరించిందంటే ఓ రాత్రిలోనే జీవితమే మారిపోతుంది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్రీరాం రాజగోపాలన్ కథ కూడా అలాంటిదే. ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ‘ఎమిరేట్స్ డ్రా MEGA7’ లాటరీలో ఏకంగా 231 కోట్లు గెలుచుకుని ఒక్కరాత్రిలో కోటీశ్వరుడిగా మారిపోయాడు. శ్రీరాం రాజగోపాలన్ తన జన్మదినమైన మార్చి 16న ఎమిరేట్స్ డ్రా లాటరీ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. టికెట్ కొనడం ఆయనకు ఒక ఆటలా అనిపించినా, అది జీవితాన్ని మార్చేసే అవకాశం అవుతుందని ఆయన ఊహించలేదు. MEGA7 ఆటలో ఆయన ఊహాజనితంగా 7 నెంబర్లను ఎంచుకున్నాడు. అయితే, ఆ సంఖ్యలే ఆయనకు కోట్లు తీసుకొచ్చాయి.

Kannappa : ‘కన్నప్ప’ కి కన్నం వేసిన ఆఫీస్ బాయ్..

లాటరీ ఫలితాలు చూసిన వెంటనే మొదట శ్రీరామ్‌కు ఇది నిజమేనా అన్న అనుమానం వచ్చింది. ఆయన మాట్లాడుతూ, “డ్రా వీడియోను నేను రెండుసార్లు చూసాను. స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న తర్వాతే నమ్మకం వచ్చింది. ఎలాంటి లాజిక్ పని చేయదు, ఇది పూర్తిగా అదృష్టం,” అన్నారు. అదృష్టాన్ని అందిపుచ్చుకున్న శ్రీరాం, ఆటను జవాబుదారీతనంతో ఆడాలంటూ పిలుపునిచ్చాడు. “నాకు ఇప్పుడు నా సమయం వచ్చింది.

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆశను విడవకండి, ఆటను ఆనందంగా ఆడండి. నా జీవితం ఒక్క రోజులో మారిపోయింది,” అంటూ ఆనందాన్ని వ్యక్తపరిచాడు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, శ్రీరాం‌కు నెట్‌ బ్రౌజింగ్‌ అంటే ప్రత్యేక ఆసక్తి ఉంది. ఆయనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫోన్‌లో బ్రౌజింగ్‌ చేస్తూ గడిపేవారు. అదే సరదాగా మొదలైన ఆన్లైన్ లాటరీ ఆడటం ద్వారా ఆయనకి ఊహించని విజయం లభించింది.

Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!

Exit mobile version