NTV Telugu Site icon

IPL 2025 Retention Players: ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోబోతోందంటే?

Ipl 2025

Ipl 2025

IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడానికి గడువు నేటితో (సెప్టెంబర్ 31) ముగుస్తుంది. సాయంత్రం నాటికి మొత్తం 10 జట్ల రిటెన్షన్ జాబితా క్లియర్ కానున్నాయి. మరి ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకోబోతోందన్న విషయానికి వస్తే.. అందిన సమాచారం మేరకు ప్రతి జట్టు ఏఏ ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందంటే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ లిస్ట్‌లో విరాట్ కోహ్లీ పేరు మొదటి స్థానంలో ఉంటుంది. వీరితో పాటు యశ్ దయాళ్, రజత్ పటీదార్‌లను రిటైన్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో సహా చాలా మంది ఉన్నత స్థాయి ఆటగాళ్లు విడుదల కావచ్చు.

ముంబై ఇండియన్స్ రిటెన్షన్:
ఈసారి ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్‌లను రిటైన్ చేయగలదు. ఇషాన్‌ కిషన్‌, టిమ్‌ డేవిడ్‌, నెహాల్‌ వధేరా సహా ఇతర ఆటగాళ్లు విడుదల కావచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ రిటెన్షన్:
ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ మధ్య చర్చలు కుదరలేదు. అందువల్ల అతన్ని విడుదల చేయవచ్చు. కాగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను కొనసాగించే అవకాశం ఉంది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌తో పాటు డేవిడ్‌ వార్నర్‌, ఖలీల్‌ అహ్మద్‌ వంటి పెద్ద, కొత్త ఆటగాళ్లు కూడా మెగా వేలంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్ రిటెన్షన్:
గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లను కొనసాగించవచ్చు. మహ్మద్ షమీ, డేవిడ్ మిల్లర్, ఉమేష్ యాదవ్, కేన్ విలియమ్సన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లను విడుదల చేయవచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ రిటెన్షన్:
లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పురాన్‌తో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బదోనీలను ఉంచుకోవచ్చు. కెప్టెన్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డి కాక్ వంటి ఆటగాళ్లను వేలానికి విడుదల చేయవచ్చు.

పంజాబ్ కింగ్స్ రిటెన్షన్:
పంజాబ్ కింగ్స్ జట్టు శశాంక్ సింగ్, ప్రభసిమ్రాన్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేయాలని ఆలోచిస్తోంది. శిఖర్ ధావన్ రిటైర్ కాగానే అందరితో పాటు అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడా, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టన్ వంటి ప్రముఖ ఆటగాళ్లను కూడా విడుదల చేయవచ్చు.

రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్:
రాజస్థాన్ రాయల్స్‌లో కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, సందీప్ శర్మలను కొనసాగించవచ్చు, ధృవ్ జురెల్ పేరు కూడా చర్చనీయాంశమైంది. జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్‌లతో సహా మిగిలిన ఆటగాళ్లను విడుదల చేయవచ్చు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగ్గరుని నేరుగా రిటైన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మల పేర్లు ఖరారు చేసింది. అయితే ఈ ముగ్గురికి ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ నిర్ణీత ధర కంటే ఎక్కువగా ఆఫర్ చేసిందని సమాచారం. రూ.23 కోట్లు, రూ.18 కోట్లు, రూ.14 కోట్లు ఇవ్వాలని అనుకుందని సమాచారం. అలాగే ట్రావిస్ హెడ్, నితీశ్ రెడ్డిని కూడా రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అబ్దుల్ సమద్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

Show comments