Site icon NTV Telugu

Hotel Bill : లక్షణంగా భోజనం చేద్దామని పోతే.. లక్ష బిల్లువేశారు

Restaurant

Restaurant

Hotel Bill : చాలా మందికి ఇంటి రుచి నచ్చనప్పుడు హోటల్ కెళ్లి భోజనం చేయడం అలవాటు. వేరే ప్రాంతాలకు వెళితే తప్పనిసరిగా రెస్టారెంట్లలో తినకతప్పదు. నలుగురు విద్యార్థులు కలిస్తే సరదాగా అలా వెళ్లడం కామనే. అలా భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లి కాలేజ్ మేట్స్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. తీరా చివరలో ఇచ్చిన బిల్లు చూసి వారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మహా అంటే భోజనం ఖరీదు నలుగురు తింటే వెయ్యి లేదా ఎక్కువలో ఎక్కువ ఐదు వేలు కావచ్చు. కానీ బిల్లు ఏకంగా దాదాపు రూ.లక్ష వచ్చింది. అయితే, ఆ రెస్టారెంట్ తమను మోసం చేస్తోందని అర్థం చేసుకున్న ఆ స్టూడెంట్స్ అందుకు తగిన బుద్ది చెప్పారు. ఈ సంఘటన ఇటలీలో చోటుచేసుకుంది.

Read Also:Minister Peddireddy Ramachandra Reddy: ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ..

వివరాల్లోకి వెళితే.. జపాన్ కి చెందిన నలుగురు విద్యార్థులు టూర్ నిమిత్తం ఇటలీకి వెళ్లారు. ఓ రోజు భోజనం కోసం వారు అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లారు. భోజనంలో వారు నాలుగు ప్లేట్ల స్లీక్, ఒక వాటర్ బాటిల్, ఫ్రైడ్ ఫిష్ ఆర్డర్ చేశారు. ఫుడ్ ఎంజాయి చేసిన తర్వాత బిల్లు చూసి వారు షాకయ్యారు. దాదాపు రూ.లక్ష బిల్లు వేశారు. అసలు తాము తిన్నది ఎంత, వచ్చిన బిల్లు ఎంతో అర్థం కాలేదు వారికి. బిల్ గురించి రెస్టారెంట్ ఉద్యోగులను నిలదీశారు. అయితే రెస్టారెంట్ సిబ్బంది చెప్పి విషయం విని విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఇంటర్నెట్ హాట్‌స్పాట్, ఇతరత్రా సౌకర్యాల పేరుతో అధికంగా హిడెన్ ఛార్జీలు వేశారని తెలుసుకున్నారు. దీంతో.. బిల్లు చెల్లించక తప్పలేదు. డబ్బులు కట్టేసి అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇలాంటి హిడెన్ ఛార్జీలు విధించడం కరెక్ట్ కాదని భావించిన ఆ విద్యార్థులు ఇదే విషయంపై న్యాయ పోరాటం చేశారు. వెంటనే ఈ హిడెన్ ఛార్జీలపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా, రెస్టారెంట్ ని ఇరికించారు. దీంతో, రెస్టారెంట్ యాజమాన్యం దిగిరావాల్సి వచ్చింది. పరిహారం కింద నలుగురు విద్యార్థులకు రూ. 12.5 లక్షలు పరిహారం ఇప్పించారు. ఆ విద్యార్థులు ధైర్యంగా తమకు జరిగిన మోసాన్ని ఎదుర్కొన్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Read Also:Uttar Pradesh : మొదటి రాత్రే చివరిరాత్రి.. గుండెపోటుతో నవదంపతులు మృతి..

Exit mobile version